ఆ స్వర్ణ వైభవానికి ఏసీబీ షాక్‌

Published: Tuesday November 06, 2018
బ్యాంకు లాకర్లలో ఎవరైనా బంగారం వస్తువులు దాచుకొంటారు. కానీ, విశాఖ అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎంవీఐ) శరగడం వెంకటరావు మాత్రం ఏకంగా జువెలరీ దుకాణాన్నే లాకర్లలో పెట్టేశారు. ధగధగలాడే నెక్లె్‌సలు, గాజులు, చెవి రింగులు, ఉంగరాలు, ముక్కుపుడకలు, జడపాయలు, వడ్డాణం, దండవంకీలు, హారం, గొలుసులు ఇలా.. ఆభరణాల వెరైటీలతో వాటిని నింపేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన కేసులో ఇప్పటికే అరెస్టు అయిన వెంకటరావుకు చెందిన లాకర్లను తెరిచిన ఏసీబీ అధికారులు సైతం.. à°† స్వర్ణ వైభవానికి నివ్వెరపోయారు. ‘వెంకటరావు మాములోడు కాదు’ అని వారు వ్యాఖ్యానించడం వినిపించింది. ఆయనతోపాటు అతని కుటుంబసభ్యులు, స్నేహితుల ఇళ్లపై à°—à°¤ శనివారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపి.. సుమారు రూ.30కోట్ల విలువైన ఆస్తులను గుర్తించిన విషయం తెలిసిందే.
 
సోమవారం వెంకటరావుకు చెందిన బ్యాంకు లాకర్లలో సోదాలు చేపట్టారు. విశాఖ మురళీనగర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 2లాకర్లు, ఊర్వశి ఎస్‌బీఐ బ్రాంచిలో à°’à°•à°Ÿà°¿, మర్రిపాలెం విశాఖ కోఆపరేటివ్‌ బ్యాంకులో à°’à°•à°Ÿà°¿, అక్కయ్యపాలెం గౌరీ కోఆపరేటివ్‌ బ్యాంకులో à°’à°•à°Ÿà°¿ చొప్పున లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 3లాకర్లు తెరిచారు. ఒక్కో లాకర్‌లో కిలోలకొద్దీ బంగారం, వెండి వస్తువులు బయటపడటం చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలోని రెండు లాకర్లు కలిపి 1.8 కిలోల బంగారం వస్తువులు, ఎస్‌బీఐ లాకర్‌లో 1.3 కిలోల బంగారం, 10కిలోల వెండి వస్తువులు బయటపడ్డాయి. మంగళవారం మిగిలిన రెండు లాకర్లను తెరిచే అవకాశం ఉంది. ఇవి కాకుండా.. కరాసలో 400 గజాల ఖాళీ స్థలం, మరో రెండు ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు కూడా à°ˆ లాకర్లలో లభ్యమయ్యాయి. à°ˆ సోదాల్లో మూడు కోట్ల విలువైన బంగారం వస్తువులు, వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు.