3గంటలే పిల్లలు క్లాసులో..

Published: Friday November 16, 2018
‘‘విద్య అంటే తరగతి గది మాత్రమే కాదు. అభ్యాసం అనేది à°’à°• à°•à°³. ఒత్తిడి లేని చదువును సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్నంగా అందిస్తాం. ఆటపాటలతో బోధించి పిల్లల్లో ఆసక్తి పెంచుతాం. విద్యకు కొత్త నిర్వచనం చెబుతాం. విశాఖను ప్రపంచంలోనే బెస్ట్‌ ఇంటెలిజెంట్‌ హబ్‌à°—à°¾ తీర్చిదిద్దుతాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ డిజిటల్‌ అక్షరాస్యులు కావాలని పిలుపునిచ్చారు. గురువారం విశాఖ నోవాటెల్‌ హోటల్‌లో ఎడ్యు టెక్‌-2018 సదస్సును ఆయన ప్రారంభించారు. à°ˆ సందర్భంగానూ, అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, డిజిటల్‌ విద్య సాఽధనా లక్ష్యాలను నిర్దేశించారు. త్వరలో ఐదు వేల డిజిటల్‌, నాలుగు వేల వర్చువల్‌ తరగతి గదులు ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు.
 
‘‘డిజిటల్‌ టెక్నాలజీ, ట్రాన్స్‌ఫార్మింగ్‌ గేమ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీతో విద్యా బోధన సాగాలి. à°ˆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తాం. విద్యార్థులపై ఒత్తిడి పడనివిధంగా సిలబస్‌ ఉండాలి. అధిక బరువైన బ్యాగులు కాకుండా వర్చువల్‌, డిజిటల్‌ తరగతి గదులు ఎంతగానో ఉపయోగపడతాయి’’ అని వివరించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బోధనలో మార్పులు తీసుకువస్తామని, కొత్త టెక్నాలజీపై వారికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత విద్యార్థులు కూడా టీచర్లకు బోధించే స్థాయికి వచ్చారని సరదాగా అన్నారు. కొత్త ఆలోచనలను ప్రోత్సహించడానికి కంటెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేస్తున్నామని, యువతలో ఉన్న ఆలోచనలను à°ˆ కార్పొరేషన్‌ ద్వారా మార్కెట్‌ చేస్తామని వివరించారు.
 
విశాఖ కొత్త చరిత్ర..
విశాఖలో ఇంటెలిజెంట్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీనికి అవసరమైన 50 ఎకరాలను వచ్చే కేబినెట్‌ సమావేశంలో చర్చించి, మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే, ఇక్కడ గేమింగ్‌ యూనివర్సిటీతో పాటు ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలు కలిగిన అన్నిరకాల విద్యా సంస్థలను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. డిజిటల్‌ బోధనపై ‘వైజాగ్‌ డిక్లరేషన్‌’ ప్రకటిస్తామని చెప్పారు. విద్యారంగంలో మార్పులకు విశాఖపట్నం వేదికగా మారిందని, చరిత్ర సృష్టించబోతుందని వ్యాఖ్యానించారు. కాగా, ఎడ్యుటెక్‌ వేదికగా పలు కీలక ఒప్పందాలు ఖరారయ్యాయి. మైడ్రీమ్‌ ప్రాజెక్టు పేరిట 635 నవోదయ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులకు సంబంధించి టెక్నాలజీ సహకారంపై సాంసంగ్‌, నవోదయ సమితి కమిషనర్‌ మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖలో నెలకొల్పనున్న ఇంటెలిజెంట్‌ హబ్‌లో డిజైనింగ్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై కొలెటెల్‌ పాటిల్‌ గ్రూప్‌, రూబికా ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదరింది. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడేలా అడోబ్‌ కంపెనీ ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ అందజేయనున్నది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా కుదిరింది.