పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం

Published: Saturday November 17, 2018
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గ్రావిటీ ద్వారా నీరిచ్చేందుకు కీలకమైన కాఫర్‌ డ్యాం పనులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాబోయే 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం విధించుకున్నారు. ఇప్పటికే జెట్‌ గ్రౌటింగ్‌ పూర్తయినందున దానికి ఇరువైపులా 6 మీటర్ల వెడల్పున కాఫర్‌ డ్యాం నిర్మాణం తలపెట్టారు. à°ˆ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించాలన్న పట్టుదల ఇంజనీర్లలో కనిపిస్తోంది. జెట్‌గ్రౌటింగ్‌ పూర్తికి à°Žà°‚à°¤ క్రియాశీలంగా వ్యవహరించారో.. కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి మరోసారి తమను తాము నిరూపించుకోవాలని వారు భావిస్తున్నారు.
 
గోదావరిలో నీటి ప్రవాహం ఆరంభం కాకమునుపే పనులన్నిటినీ పూర్తిచేసి, సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఖరీఫ్‌ నాటికి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను అందించే ఉద్దేశంతో కాంట్రాక్టు సంస్థలు పనులకు ఉపక్రమించాయి. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల డిజైన్లకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి లభించింది. ఎగువ డ్యాం పనులకు క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌à°ˆ ఆనందకుమార్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. దీనిని మే 30లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నెలరోజుల ముందే పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థ నవయుగ సంకల్పించింది. అందుకు తగినట్లుగానే ఆధునిక యంత్రాలను రప్పిస్తోంది. ‘మాకంటూ పక్కా ప్రణాళిక ఉంది. పనులన్నిటినీ à°šà°•à°šà°•à°¾ పూర్తి చేస్తాం. మా యంత్రాంగం 24 గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉంది. సీఎం ఆశించినదానికి అనుగుణంగానే గ్రావిటీ ద్వారా నీరు అందించేందుకు వీలుగా, గడువులోపే పనులన్నిటినీ కొలిక్కి తెస్తాం. ఎక్కడా రాజీ పడేదిలేదు. సమయంతోనే పరుగులు పెడతాం’ అని ఇంజనీర్లు పేర్కొన్నారు. జెట్‌ గ్రౌటింగ్‌ ఇరువైపులా వంద మీటర్ల వెడల్పులో యంత్రాలతో చదును చేస్తున్నారు. కాపర్‌ డ్యాం నిర్మించే ప్రాంతం మొత్తంలో సర్వేల ద్వారా జెండాలు వేశారు. దిగువ కాఫర్‌ డ్యాం పనులను పది రోజుల్లో ప్రారంభించే అవకాశముంది.
 
నిర్మాణం ఇలా..
గోదావరిలో సుమారు 2,480 మీటర్ల పొడవున, 187ను à°‚à°šà°¿ 237 మీటర్ల మేర వెడల్పున.. 42.5 మీటర్ల ఎత్తున ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మిస్తారు. దీనికిగాను 66.751 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి, రాయి, మెటల్‌ను నిర్మాణంలో వినియోగిస్తారు. ఇందులో 42.324 లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయి, 5.116 లక్షల క్యూబిక్‌ మీటర్ల హీటింగ్‌ సాయిల్‌, 3.573 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌, 26,700 క్యూబిక్‌ మీటర్ల జిగురుమట్టిని వాడతారు. జెట్‌గ్రౌటింగ్‌ జరిగిన ప్రాంతంలో 6మీటర్ల వెడల్పున ఇరువైపులా నల్ల మట్టితో నింపుతారు. ఇలా నింపే నల్లమట్టిని ఏ రోజుకారోజు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో పరీక్షలు చేస్తారు. దీనికి సంబంధించి అత్యంత ఆధునికంగా సెంట్రల్‌ సాయిల్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎ్‌సఎంఆర్‌ఎస్‌) ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.
 
వెడల్పులో హెచ్చుతగ్గులు..
కాఫర్‌ డ్యాం నిర్మాణంలో గోదావరి గర్భం లోతును బట్టి వెడల్పును నిర్దేశించారు. జెట్‌గ్రౌటింగ్‌ జరిగినప్పుడు భూమి అంతర్భాగంలో నిపుణుల సూచనల మేరకు నిర్మాణం చేస్తూ వచ్చారు. అప్పటి మాదిరిగానే కాఫర్‌ డ్యాం నిర్మాణంలోనూ జాగ్రత్తలు పాటించబోతున్నారు. దీనికితోడు ఎగువ కాఫర్‌ డ్యాంకు మరింత ఎగువన వంద మీటర్ల వెడల్పున ప్రత్యేకించి కల్వర్టు నిర్మాణానికి à°ˆ మధ్యనే కేంద్ర జలసంఘం అనుమతి ఇచ్చింది. వంద మీటర్ల వెడల్పున కల్వర్టు నిర్మించి, దానికి 80 పైపులు అమర్చుతారు. ప్రాజెక్టుకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా వైపున ఉన్న గట్టుకు ఆనుకుని సాగే గోదావరి ప్రవాహాన్ని ఇలా మళ్లిస్తారు.