పవన్‌కు కళా వెంకట్రావు లేఖ

Published: Monday November 19, 2018
‘ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని ప్రకటించుకున్న మీరు రాష్ట్ర ప్రజల కోసం ఏ విషయంలో నిబద్ధతతో, నిజాయితీతో పనిచేశారో చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం పవన్‌కు ఆయన ఐదు పేజీల బహిరంగ లేఖను రాశారు. ‘‘నోట్ల రద్దు, జీఎస్టీ, సీబీఐలో అవినీతి ఆరోపణలు, రాఫెల్‌ స్కాం, ఆర్‌బీఐపై దౌర్జన్యం, కాగ్‌పై ఒత్తిడి, సుప్రీంకోర్టు వ్యవహారంలో జోక్యం, గవర్నర్‌ వ్యవస్థల దుర్వినియోగం వంటి ప్రజా ప్రయోజనాల విషయాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు.
 
వాటిపై పోరాడే రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే లక్ష్యంగా వ్యవహరించడం ఏ విధంగా సరైంది? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే నైతిక బలం లేనందున ప్రతిపక్షనేత జగన్‌తో పాటు మీరు కూడా బీజేపీతో లాలూచీ పడ్డారా? మీ వైఖరి మోదీతో లోపాయికారి మద్దతుకు రుజువు కాదా? ఆవేశంతో కూడిన మీ ప్రసంగంలో ఆలోచన లేదని ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి చట్ట ప్రకారం రూ.75 వేల కోట్లు రావాలని మీరు ఏర్పాటు చేసిన జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ నిర్ధారించింది. à°† రోజు à°ˆ విషయాన్ని ఆర్భాటంగా ప్రకటించి, ప్రస్తుతం దానిపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు. కాకినాడ పోర్టుపై ఆరోపణలు చేస్తున్న మీరు, à°† పోర్టు అధినేత ఇంట్లో మీ సోదరుడు చిరంజీవి ఎందుకు ఉన్నారో ప్రజలకు చెప్పాలి.
 
విశాఖపట్నంలోని వట్టి రవి ఇంట్లో ప్రతిపక్షనేత జగన్‌, మీరు కలిశారన్న వార్తలను ఇప్పటి వరకూ ఎందుకు ఖండించలేదు? అలా అయితే జగన్‌ మిమ్మల్ని కలిసి 40 సీట్లు ఆఫర్‌ చేశారన్న వార్త నిజమేనా? ప్రస్తుతం మైనింగ్‌ చేస్తున్న సంస్థ యజమానుల వెనుక వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారన్న విషయం మీకు తెలియదా?. 17 అంశాలతో కేంద్రంపై పోరాటం చేస్తానని చేసిన ప్రకటన ఇప్పుడేమైంది. పోటీ చేసే స్థానంపై క్లారిటీ లేకుండా రాజకీయాలా? రైలు యాత్రతో సాధించిందేమిటి? ఏసీ బోగీలో ప్రయాణం చేసి సామాన్య ప్రజలను కలిసినట్లు ఫోటోలతో ప్రచారం చేసుకుంటున్నారు. కులాలకు అతీతంగా ప్రకటించుకుంటూనే కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తుండటం వెనుక నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు దాగున్న సంగతి వాస్తవం కాదా?. సంస్కార హీనంగా మాట్లాడనంటూనే.... పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ సమాజానికి, మిమ్మల్ని అనుకరిస్తున్న యువతకు ఏం మేసేజ్‌ ఇవ్వాలనుకుంటున్నారు’’ అని లేఖలో ప్రశ్నించారు