మోదీని ధిక్కరించిన బాబు

Published: Monday November 19, 2018
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీని చూసి పలు పార్టీలు గడగడలాడుతున్నాయి. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్న పార్టీలే అణగిమణగి ఉండాల్సిన పరిస్థితి. అలాంటిది ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా ఢిల్లీతో తలపడుతున్నారు. మోదీని ఢీకొంటున్నారు. ఇప్పటికే రెండు కీలక అంశాల్లో ఢిల్లీని ఢొకొట్టారు. ఏపీ డీజీపీ ఎంపిక విషయంలోను, ఇప్పుడు సీబీఐకి ఏపీలో అనుమతి ఇచ్చే విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. à°ˆ నేపథ్యంలో అసలు ఏపీలో ఏం జరుగుతోంది? బాబు తదుపరి వ్యూహం ఏంటి? అంటూ ఢిల్లీ వర్గాలు ఆసక్తిగా ఆరా తీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు.. ఏపీలోని తమ బ్యాచ్‌మేట్లు, తెలిసినవారికి ఫోన్‌ చేసి అడుగుతున్నారు. తదుపరి చర్యలు ఏంటి? ఇంకా ఏమైనా ఉన్నాయా? అని ఆసక్తిగా అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత డీజీపీ ఎంపిక విషయంలో కేంద్రానికి ఇచ్చిన అధికారాన్ని వెనక్కుతీసుకుంది.
 
డీజీపీగా నండూరి సాంబశివరావు నియామకం జరిగే నాటికి.. డీజీపీ ఎంపిక అనేది కేంద్రం చేతిలో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియామకం కోసం కొందరు సీనియర్‌ అధికారుల పేర్లను పంపితే.. వాటిలో ఎవరిని ఎంపిక చేయాలన్నది కేంద్రం ఇష్టం. à°† కమిటీలో యూపీఎస్సీ నుంచి ఒకరు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. అంటే ఇద్దరు సభ్యులు కేంద్రం తరఫునే ఉంటారు. మెజార్టీ వారిదే. నాడు డీజీపీ నియామకం కోసం సాంబశివరావుతో పాటు మరికొందరు అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అయితే à°† జాబితాలో సాంబశివరావు పేరు ఉండడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన అప్పటికే ఇంచార్జి డీజీపీగా ఉన్నారు. à°† హోదాలో అన్నాళ్లు కొనసాగించి.. ఇంకొన్ని నెలల్లో పదవీ విరమణ చేస్తారనగా రెగ్యులర్‌ డీజీపీగా బాధ్యతలు అప్పగించడం ఏమిటని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా నుంచి సాంబశివరావు పేరు తీసేయాలని సూచించింది. అయితే దీనికి చంద్రబాబు ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది.
 
సాంబశివరావుతో కూడిన జాబితానే మళ్లీ పంపింది. పంపడం వరకు తమదే అధికారమని, పంపిన వారిలో ఎవరిని ఎంపిక చేస్తారనేది మీ ఇష్టమని పేర్కొంది. అంతే తప్ప అసలు జాబితా రూపకల్పనతోనే కేంద్రం జోక్యం ఏంటని ప్రశ్నించింది. కానీ, కేంద్రం ఆ పేరు తీసేసి పంపాల్సిందేనని, లేకుంటే అప్పటివరకు డీజీపీ ఎంపికకు సంబంధించిన కేంద్ర కమిటీ సమావేశం కూడా పెట్టబోమంటూ సంకేతాలిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి.. అసలు డీజీపీని నియమించే అధికారం కేంద్ర కమిటీకి ఇవ్వడమెందుకు? రాష్ట్ర ప్రభుత్వమే ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుందని నిర్ణయించింది. ఒక రాష్ట్ర డీజీపీ ఎంపికను యూపీఎస్సీ కమిటీకి ఇవ్వడమా? రాష్ట్ర ప్రభుత్వమే చేసుకోవడమా? అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమే. దీంతో డీజీపీ ఎంపిక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ.. ఆ మేరకు అవసరమైన చట్టపరమైన మార్పులను చేశారు. దీంతో ఆ విషయంలో కేంద్రం పెత్తనానికి అడ్డుకట్ట పడింది.