కాలువలో యువకుడి గల్లంతు సమిశ్రగూడెం శివాలయం రేవులో ఘటన..

Published: Tuesday November 20, 2018
 à°•à°¾à°°à±à°¤à±€à°• స్నానం చేస్తే మంచి జరుగుతుందని కాలువలో స్నానానికి దిగిన పద్దెనిమిదేళ్ల యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు.. బంధువులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం సమిశ్రగూడెంకు చెందిన డొంకాని భాస్కరరావు లక్ష్మీదుర్గ దంపతులు కుమారుడు అఖిల్‌, కుమార్తె సౌమ్యతో సోమవారం కార్తీక స్నానం చేసేందుకు సమిశ్రగూడెంలోని శివాలయం రేవుకి వచ్చారు. అప్పటికే స్నానాని à°•à°¿ వచ్చిన భక్తులతో రేవు కిటకిటలాడుతోంది. స్నానం ఆచరిస్తుండ à°—à°¾ అఖిల్‌తోపాటు ప్రసాద్‌, రాజేష్‌ అనే మరో ఇరువురు రేవును ఆనుకుని ఉన్న లోతైన ప్రదేశంలో మునిగిపోసాగారు.
 
 
చెంతనే ఉన్న భాస్కరరావు ప్రసాద్‌, రాజేష్‌ను కాపాడి అఖిల్‌ను కాపాడే లోగా అప్పటికే ప్రవాహంలో అఖిల్‌ మునిగి గల్లంతయ్యాడు. వెతికినా ఫలితం లేకపోవడంతో సమిశ్రగూడెం పోలీసులకు సమాచా à°°à°‚ అందించి నీటి పారుదల శాఖ అధికారుల సహకారంతో నీటి విడుదలను అదుపు చేశారు. అనంతరం నిడదవోలు అగ్నిమాపక అధికారులు à°—à°œ ఈతగాళ్ళు, జాలర్లతో వలలు వేసి గాలింపు చర్యలు చేపట్టారు. భాస్కరరావు ఆటో డ్రైవర్‌ కాగా కుమారుడు అఖిల్‌ తణుకులో పాలిటెక్నిక్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని బుధవారం నోములు నోచుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కార్తీక స్నానమాచరిస్తే మంచిదని తల్లిదండ్రులతో వచ్చిన అఖిల్‌ గల్లంతవడంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం.
 
 
ప్రమాదకరంగా స్నానాల రేవు..
కాలువ ఆధునికీకరణలో భాగంగా ఇటీవల పూడికతీత పనులు నిర్వహించారు. దాంతోపాటు ఇటీవలే సమిశ్రగూడెం చెరువు ఆధునికీకరించడానికి వినియోగించిన ఎక్స్‌కవేటర్‌ను శుభ్రపరి చేందుకు à°ˆ రేవులోకే దించారు. à°† సమయంలో ఎక్స్‌కవేటర్‌ దిగబడి పెద్ద గొయ్యి ఏర్పడింది. à°† గొయ్యే ప్రస్తుత ప్రమాదానికి కారణమంటున్నారు స్నానమాచరించడానికి వచ్చిన భక్తులు. దీంతోపాటు కార్తీక మాసం పుణ్యస్నానాలు ఆచరించే రేవుల వద్ద పంచాయతీ సిబ్బంది సరైన చర్యలు చేపట్టలేదు. రేవులో ఉన్న విద్యుత్‌ స్తంభానికి రెండు లైట్లు ఉన్నప్పటికీ అవి పని చేయకపోవడంతో చీకటిలోనే స్నానమాచరిస్తున్నారు.