పాడి..పంట బాగున్న ఊరిపై పగబట్టి బాధిస్తున్న మహమ్మారి

Published: Wednesday November 21, 2018
దాదాపు 500 ఎకరాల్లో à°…à°°à°Ÿà°¿ సాగు! కళకళలాడుతున్న మొక్కజొన్న, దానిమ్మ, కరివేపాకు పంటలు! చుట్టూ దడి కట్టినట్టు తోటలు, ఉద్యానవనాలు! ప్రతి రోజూ 300 లీటర్లకు పైగా పాడి! ఇలా ఏ లోటూ, చింతా లేని à°† గ్రామానికి ఇప్పు డు పెద్ద కష్టమొచ్చింది. బతుకులు బాగున్నాయన్న సంతోషాన్ని చిదిమేస్తూ, à°† ఊరును కేన్సర్‌ తినేస్తోంది. మూడు వందల మంది కూడా లేని అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం కొట్టాలపల్లి గ్రామంలో 20 మందికిపైగా కేన్సర్‌ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. 13 ఏళ్ల కుర్రాడి నుంచి 70 ఏళ్లు దాటిన వృద్ధుల దాకా.. ఎవరినీ వదిలిపెట్టక బలిగొంటోంది. ఇప్పటిదాకా ఏడుగురు మరణించగా, మరో 13 మందికిపైగా చికిత్స పొందుతున్నారు.
 
చల్లా శకుంతలమ్మ(55) మొదటిసారిగా కేన్సర్‌ వ్యాధికి గురయింది. ఆమె తిరుపతిలో వైద్యం చేయించుకొని కోలుకుంది. à°† తరువాత.. కొద్ది కాలానికి కాంతమ్మ(55), ఆమె భర్త రామయ్య కేన్సర్‌కు గురయ్యారు. వీరిలో కాంతమ్మ చనిపోయింది. రామయ్య తిరుపతిలో చికిత్స పొందుతున్నాడు. వీరిరువురి చికిత్స కోసం కుటుంబసభ్యులు లక్షల విలువ చేసే ఐదు ఎకరాల పొలాన్ని అమ్మారు. గార్లదిన్నె జడ్పీ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న విష్ణువర్థన్‌(13) కేన్సర్‌తోచనిపోయాడు. ఏకైక కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు గ్రామం విడిచి బెంగళూరుకు వెళ్లిపోయారు.
 
ఇంకా.. తిరుమలయ్య(60), పీ వెంకటమ్మ (45), జీ సూరప్ప (55), బీ నారాయణమ్మ(60), బీ నారాయణ(70) చికిత్స పొందుతూనే ప్రాణాలు విడిచారు. వీరంతా ఊపిరితిత్తులు, నోరు, రక్తం, ఛాతీ, పేగులకు కేన్సర్‌ సోకి మృతిచెందినట్లు తెలిసింది. ఇక.. శ్రీలక్ష్మి(45) హైదరాబాద్‌లో కేన్సర్‌కు చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకొంటున్న à°ˆ గ్రామానికి చెందిన భరణి(25) అక్కడే వైద్యం చేయించుకొంటున్నాడు.
 
కొట్టాలపల్లి సమీపంలోని వంక వద్ద బోరు వేసి పైపులైన్‌ ద్వారా ట్యాంకుకు అక్కడినుంచి ఇళ్లకు తాగునీరు సరఫరా చేసేవారు. కొద్ది సంవత్సరాలుగా à°† ట్యాంకుకు అమర్చిన కొళాయిలు పనిచేయడం లేదు. దీంతో నేరుగా ఇళ్లకు కొళాయిలు వేసుకొన్నారు. అలా సరఫరా అవుతున్న నీటిని బ్లీచింగ్‌ లేక క్లోరిన్‌ వేసి శుభ్రం చేయడంలేదని గ్రామస్థులు చెబుతున్నారు. సరాసరి బోరునీరు సరఫరా చేస్తున్నారని, దానివల్ల తాగునీటిలో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉంటోందని గ్రామస్థులు అంటున్నారు. 30 ఏళ్ల క్రితం à°ˆ గ్రామంలో వాటర్‌ ట్యాంకు ఏర్పాటుచేశారు. ఇది ప్రస్తుతం జీర్ణావస్థకు చేరుకొంది. పలుచోట్ల దెబ్బతిని నీరు లీకవుతోంది. ట్యాంకు పైభాగంలో కప్పులేకపోవడంతో దుమ్ముధూళి, పురుగులు చేరి, అవి నీటితోపాటు సరఫరా అవుతున్నాయి.
 
అదే నీరు తాగి, గ్రామస్థులు అస్వస్థతకు గురవుతున్నారు. నీటిలో తేడా, డ్రైనేజ్‌ వ్యవస్థ సరిగా లేకపోవడమే కేన్సర్‌కు కారణమని గ్రామస్థులు ఎక్కువమంది గట్టిగా నమ్ముతున్నారు. మరికొందరు మాత్రం, పంటపొలాలకు పరిమితికి మించి పురుగుమందుల వాడటం గురించి ప్రస్తావిస్తున్నారు. పురుగుమందుల వలన రైతు కుటుంబాలతోపాటు, వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే ఆడ, మగవారంతా కేన్సర్‌కు గురి అవుతున్నారని అంటున్నారు. గ్రామంలో ఏర్పాటుచేసిన సెల్‌టవర్‌ రేడియేషన్‌ కారణంగా కూడా కేన్సర్‌ వ్యాధి సోకే అవకాశం ఉన్నదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
ఏడాదిగా తమ గ్రామం మృత్యువుతో పోరాడుతున్నా, వైద్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు తీవ్రంగా వాపోతున్నారు. దీనిపై à°ˆ గ్రామ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ను ఆరా తీయగా, కొట్టాలపల్లిలో ఎక్కువ మందికి కేన్సర్‌ రావడానికి à°—à°² కారణాలు అంతుపట్టడంలేదని, దీనిపై త్వరలో అధికారులు గ్రామంలో పర్యటించి, వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు వివరణ ఇచ్చారు.