మంత్రి లోకేశ్‌ ధ్వజం...

Published: Thursday November 22, 2018
తనపై పదేపదే ఆరోపణలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వాటికి ఎందుకు ఆధారాలు చూపించలేకపోతున్నారని టీడీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ ప్రశ్నించారు. తమ కుటుంబ ఆస్తుల ప్రకటన సందర్భంగా బుధవారం సాయంత్రం ఆయన ఇక్కడ ప్రజా వేదిక భవనంలో విలేకరులతో మాట్లాడారు. ‘పవన్‌పై నాకు చాలా గౌరవం. ఆయన నాపై ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ఆధారాలు చూపాలని ఏడెనిమిదిసార్లు సవాల్‌ చేశాను. కానీ చూపించలేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉండగా మాపై పాతిక కేసులు వేశారు. ఒక్కటీ నిలవలేదు. ఆయన అధికారంలోకి వచ్చాక 11 సభాసంఘాలు, 4 కేబినెట్‌ సబ్‌ కమిటీలు, 4 అధికారుల విచారణలు, 3 న్యాయ విచారణలు, ఒకసీబీసీఐడీ విచారణ వేశారు. అయినా ఏమీ తేల్చలేకపోయారు. à°—à°¤ ఎన్నికల ముందు వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి మాపై 2,490 పేజీల పిటిషన్‌ వేశారు. కోర్టు కొట్టివేసింది’ అని గుర్తుచేశారు. అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులు కోర్టు స్వాధీనంలో ఉంటే వాటిని తానె లా కొనగలనని విస్మయం వ్యక్తం చేశారు.
 
‘అగ్రిగోల్డ్‌ డిపాజిట్ల వసూలు అంతా వైఎస్‌ హయాంలో జరిగింది. మొత్తం కుంభకోణం à°† సమయంలోనే చోటుచేసుకుంది. మళ్లీ అదేపార్టీ వారు మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. మా కుటుంబ అవసరాలకు మాకో కంపెనీ ఉంది. దానిపై వచ్చిన ఆదాయాన్ని సరిగ్గా ఇన్వెస్ట్‌ చేసుకుంటే చాలు. తప్పు చేయాల్సిన అవసరం మాకేంటి? దొంగ పనులు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు’ అని తేల్చిచెప్పారు. హెచ్‌సీఎల్‌ కంపెనీకి ఇచ్చిన భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను లోకేశ్‌ నవ్వుతూ తోసిపుచ్చారు. రాయితీలిస్తేనే కంపెనీలు వస్తాయని.. వాటిని కుంభకోణాలని ఆరోపిస్తే ఎవరూ ఇక్కడకు రారని వ్యాఖ్యానించారు. జగన్‌ను ఆయన అభిమాని శ్రీనివాస్‌ కోడి కత్తితో గుచ్చితే à°† తప్పు తమదెలా అవుతుందని ప్రశ్నించారు.