తెలంగాణలో నిలదీతల పర్వం ఏపీలో ఎమ్మెల్యేలు అప్రమత్తం

Published: Saturday November 24, 2018
సమస్యలు పరిష్కరించాలని మీ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు! ఎన్నికలప్పుడే మేం గుర్తుకొచ్చామా? ఏం ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుగుతున్నావ్‌? ... తెలంగాణలో పలుచోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను నిలదీస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమవున్నాయి. ‘మీరు ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. నిత్యం ప్రజల్లో ఉంటే తిరస్కారం ఉండదు’ అని తెలుగుదేశం అధిపతి, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు పదేపదే చెబుతున్నారు. వెరసి... తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న అనుభవాలు ఆంధ్ర ప్రదేశ్‌లోని ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నాయి.
 
అంతకుముందుకంటే ఎక్కువ సమయం ప్రజల్లో ఉంటూ... సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించే దిశగా జాగ్రత్త చర్యలు మొదలు పెట్టారు. తెలంగాణలో ఎమ్మెల్యేల నిలదీత దృశ్యాలను ఏపీ ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. స్థానిక సమస్యలను పట్టించుకోకపోవడం, కొన్ని గ్రామాలకు ఎన్నికల సమయంలోనే వెళ్లడం, రహదారులు, మురుగుకాల్వలు, మంచినీటి వసతి వంటి కనీస సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాలవల్ల ఈ నిలదీతలు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఈ సమాచారాన్ని ఏపీ ఎమ్మెల్యేలు తమకు తెలిసిన వారి ద్వారా మరింత లోతుగా తెలుసుకుంటున్నారు.
 
మరో ఆరు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. నియోజకవర్గాల్లో తాము ఇప్పటిదాకా పెద్దగా వెళ్లని నివాస ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అని ఎమ్మెల్యేలు లెక్కలు తీస్తున్నారు. ముందుగా అక్కడకు వెళ్లి ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కింది స్ధాయి నాయకులతో మాట్లాడుతూ పెండింగ్‌ సమస్యలు ఎక్కడ ఎలాంటివి ఉన్నాయో ఆరా తీస్తున్నారు. సొంత పార్టీలోనే ఉన్నా వివిధ కారణాలతో దూరమైన గ్రామ, మండల స్థాయి నాయకులతో సంబంధాలు మెరుగుపర్చుకొనే ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా పూర్తిగా నియోజకవర్గ పర్యటనల్లో నిమగ్నమయ్యారు. బాగా ముఖ్యమైన పనిఉంటే తప్ప మెజారిటీ ఎమ్మెల్యేలు సచివాలయానికి కూడా రావడం లేదు. అనేక మంది మంత్రులు కూడా శాఖాపరమైన పనులు తగ్గించుకొని సొంత నియోజకవర్గాలకు... సొంత జిల్లాకు సమయం పెంచడం గమనార్హం.
 
పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండేలా ఏడాది కిందటి నుంచే చంద్రబాబు ప్రణాళికలు రచించారు. à°—à°¤ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు. à°ˆ కార్యక్రమం జరిగిన రెండు నెలలు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు తన వద్దకుగానీ, రాజధానికి గానీ వస్తే ఊరుకోలేదు. దీంతో ఎమ్మెల్యేలకు దీనిని సీరియ్‌సగా తీసుకోక తప్పలేదు. à°ˆ కార్యక్రమంలో అందిన వినతిపత్రాలను పరిష్కరించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల కొత్త సామాజిక పింఛన్లు మంజూరు చేసింది. రెండు లక్షల తెల్ల రేషన్‌ కార్డులు ఇచ్చారు.