అన్నదాతలతో బ్యాంకర్ల ఆటలు

Published: Sunday November 25, 2018
రబీ పంట రుణాలు.. రైతన్నలకు అందకుండా పోతున్నాయి. బ్యాంకర్లు అరకొరగా విదిలిస్తుండడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. వర్షపాతం ఆశాజనకంగా ఉన్న జిల్లాలు, నీటి వసతి ఉన్న ప్రాంతాల రైతులకు విరివిగా రుణాలిస్తున్న బ్యాంకర్లు కరవు బారిన పడిన జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు నామమాత్రంగానే పంపిణీ చేస్తున్నారు. రబీలో వర్షాధారంగా సాగుచేసే పంటల కన్నా, సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, శనగ, చెరకు, వేరుశనగ, పొగాకు వంటి పంటలు వేసే రైతులకే పంట రుణాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. రబీ సీజన్‌ à°•à°¿à°‚à°¦ 13 జిల్లాల్లో రూ.29,250 కోట్లు పంట రుణాలివ్వాలని బ్యాంకర్ల కమిటీ నిర్దేశించగా, ఇప్పటి వరకు రూ.8,660 కోట్లు(30%) మాత్రమే రైతులకు అందాయి. అనంతపురం జిల్లాలో రూ.2,686 కోట్ల మేరకు పంట రుణాలివ్వాల్సి ఉండగా, ఇంత వరకు రూపాయి కూడా రుణమిచ్చిన దాఖలా లేదు. కృష్ణా జిల్లాలో 70%, తూర్పుగోదావరిలో 60%, ప్రకాశం జిల్లాలో 50% రబీ పంట రుణాలిచ్చినా, మిగిలిన 10 జిల్లాల్లో ఇప్పటి వరకు 11% నుంచి 32% మాత్రమే రుణా లు ఇచ్చారు.
 
ప్రభుత్వం కరవు ప్రాంతాలుగా గుర్తించిన మండలాల్లో వ్యవసాయశాఖ రాయితీపై విత్తనాలు సరఫరా చేసినా, సాగు ఖర్చులకు అప్పుపుట్టక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. à°—à°œ తుఫాను, అల్పపీడన ప్రభావంతో చెదురుమదురుగా పడుతున్న వర్షాలతో పంటలు వేస్తున్న దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంత రైతులు పెట్టుబడుల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. అయితే, వాన ల్లేవుగా, చూసి ఇద్దాంలే అంటూ బ్యాంకర్లు తిప్పించుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు ఖరీ్‌ఫలో సాగైన పత్తి దిగుబడులు తగ్గినందున పంట అమ్మితే వచ్చే డబ్బు కౌలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో బాకీలకే సరిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. à°ˆ పరిస్థితుల్లో రబీ సాగుకు రుణాలివ్వాలని రైతులు కోరుతున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులకు à°ˆ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 9.56 లక్షల మందికి రూ.4 వేల కోట్లు పంట రుణాలుగా ఇచ్చారు. అవి కూడా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువ మంది కౌలు రైతులకు అందాయి. మిగిలిన రైతుల పరిస్థితి ఇబ్బందిగా మారింది.