పవన్‌పై అసభ్యకర పోస్టింగులు

Published: Tuesday November 27, 2018

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టింగ్‌లను షేర్‌ చేస్తున్న వ్యక్తిపై కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్‌ కల్యాణ్‌ను కించపరిచేలా ఉన్న ఫోటోలు, వీడియోలను వికాస్‌ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చే స్తుండటంతో జనసేన కార్యకర్త వాసు ఫిర్యాదు చేయగా, ఐటీ యాక్టు ప్రకారం కేసు నమోదుచేశారు.