ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ

Published: Thursday November 29, 2018

రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరిగేందుకు వీలుగా డబ్బు, మద్యం పంపిణీని పూర్తిగా నివారించాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌ ఆదేశించారు. à°ˆ మేరకు బుధవారం ఆయన ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్లతో కలిసి తెలంగాణ, సరిహద్దు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, ప్రధాన ఎన్నికల అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. à°ˆ సందర్భంగా రావత్‌ మాట్లాడుతూ, ‘‘ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని నివారించేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలి. ఇందుకు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రాలు సహకరించాలి’’ అని ఆదేశించారు. తెలంగాణతో ఏపీకి ఉన్న సరిహద్దు విస్తీర్ణాన్ని ఏపీ సీఎస్‌ అనిల్‌ చంద్ర పునేఠ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో చేసిన ప్రత్యేక ఏర్పాట్లను వివరించారు. పర్యవేక్షణకు à°’à°• ఐపీఎస్‌ అధికారిని నియమించిన విషయాన్ని తెలిపారు.