ఆయన శత్రువూ కాదు..బాబు మిత్రుడూ కాదు

Published: Monday December 03, 2018
‘వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నేరాలు చేశాడు. ఎప్పటికైనా లాలూప్రసాద్‌ యాదవ్‌లా జైలుకే వెళ్తాడు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా పారిపోయాడు. పాపం.. ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేసుకుంటున్నాడు..’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవాచేశారు. ఆదివారం అనంతపురంలో ఆయన జనసైనికులతో కవాతు నిర్వహించారు. గుత్తి రోడ్డులోని మార్కెట్‌యార్డు నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు యువతతో భారీ ర్యాలీగా వచ్చి బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం కావాలని తానెప్పుడూ కలలు కనలేదన్నారు. రాజ్యాంగం తనకు à°† అవకాశం కల్పించే సమయమొచ్చిందని చెప్పారు. జగన్‌ తనకు శత్రువూ కాదని, సీఎం చంద్రబాబు మిత్రుడూ కాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మనల్ని ఏ కులమో, ఏ మతమో అని చూడకుండా ఆంరఽధులుగా చూసి తెలంగాణ నుంచి తన్ని తరిమేశారని ఆరోపించారు. ఏపీ ప్రజలను తెలంగాణ నాయకులు దోపిడీదారులుగా చిత్రీకరించారన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు ఎన్నికల పనిమీద హైదరాబాద్‌లో ఉన్నారని, పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి రావాల్సిన కర్మ ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. ఇవన్నీ ప్రశ్నించాల్సిన జగన్‌ పాపం.. ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా ఏమన్నారంటే..
 
సెజ్‌లతో రైతులకు అన్యాయం..
‘వైఎస్‌ హయాంలో అత్యధికంగా సెజ్‌à°² ద్వారా రైతులకే అన్యాయం జరిగింది. అందుకే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడడానికి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ రావడానికి సపోర్ట్‌ చేశాను. కానీ కొత్తకోడలు కొప్పులో చెప్పు పెట్టినట్లు ప్రధాని మోదీ జీఎస్టీతో ప్రజలను లూటీ చేశారు. అప్పట్లో చంద్రబాబు జనసేన సాయం అడిగారు. నేనేమీ ఆశించకుండా సహకరించా. రాష్ర్టాన్ని అవినీతిరహితంగా ఉం చాలని ఆయన్ను కోరా. నోట్లో వెన్నముద్ద పెట్టినా కొరకలేడని చెప్పే మంత్రి లోకేశ్‌ రాష్ట్రంలో ఇసుకను మింగేశారు. 2016లో అమరావతి రాజధాని నిర్మాణానికి భూముల కోల్పోతున్న రైతుల తరఫున చంద్రబాబును కలిసి భూసేకరణను ఆపాలని కోరాను. అప్పట్లో రెడ్డి సామాజిక వర్గ రైతులకు జగన్‌ గుర్తుకు రాలేదు. పవన్‌ గుర్తుకొచ్చాడు. మళ్లీ ఇప్పుడు భూసేకరణ ప్రక్రియ సాగిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు నా వద్ద ఆధారాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అధికారంలోకి రావు. 2019 నుంచీ 2021 వరకూ సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి. యుద్ధానికి యువత సన్నద్ధంగా ఉండాలి.’