ప్రజాప్రతినిధులు సమన్యాయం చేయాలి

Published: Tuesday December 04, 2018
‘ప్రజలు ఓట్లు ఎవరికేశారన్నది ముఖ్యం కాదు.. అందరికీ సమన్యాయం చేసే దిశగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి. జిల్లాలో కొందరు నాయకులు తమకు ఓటు వేయలేదని ప్రజలు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇది అత్యంత దారుణం..’ అని జన సేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. సోమవారం అనంతపురం సమీపంలోని à°Ž.నారాయణపురం గ్రామంలో రైతులతో మాట్లాడారు. కరువు పరిస్థితులను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో అత్యంత కరువు ప్రాంతంగా పేరొందిన అనంతపురం జిల్లా కరువుతో అల్లాడిపోతోంది. కాలువల ద్వారా నీటిని జిల్లాలు దాటించడం కాదు. అనంతపురం జిల్లా అంతటికీ నీరివ్వాలి. కరువు, రైతులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కరువును జయించామంటూ చంద్రబాబు సభల్లో గొప్పలు చెప్పుకోవడం కాదు.
 
క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధరలేక జిల్లా రైతులు అల్లాడిపోతున్నారు. రెయిన్‌గన్‌à°² వినియోగంతో జిల్లాలో కరువును జయించామని ప్రకటించి తర్వాత వాటి వాడకాన్ని పూర్తిగా వదిలేశారు’ అని పవన్‌ ఆరోపించారు. అన్నివిధాలా రైతులను ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు సొంత లబ్ధి కోసమే ఆరాటడపడుతున్నారని విమర్శించారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవలసిన ప్రజాప్రతినిధులు తమకు ఓట్లు వేయలేదని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అలాంటివారికి రైతులు తమ ఓట్లతో బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు.
 
‘జిల్లాకు కృష్ణా, తుంగభద్ర జలాలు బాగానే వచ్చినా మంత్రి సునీత, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఆధిపత్య పోరు వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం రూరల్‌ తన జోన్‌ పరిధిలోకి రాదని మంత్రి.. వైసీపీకి ఓట్లేశారు.. మీకెందుకు చేయాలని ఎమ్మెల్యే అంటూండడంతో రైతులు బాధపడుతున్నారు. ఓట్లు ఎవరికి వేసినా అందరికీ పనిచేయడం జనసేన విధానం. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం కాదు.. లాభసాటి ధర ఇవ్వాలి. తక్కువ వర్షంతో పండే పంటలను సాగుచేసే దిశగా చైతన్యపరచాలి. జనసేన అధికారంలోకి వస్తే రైతులను అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరిస్తా.’ అని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌, టీసీ వరుణ్‌, భవానీ రవికుమార్‌, జయరామిరెడ్డి, వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.