100 శాతం అసలు మొత్తాన్ని ఇస్తాను ...

Published: Wednesday December 05, 2018
 à°¬à±à°¯à°¾à°‚కు రుణాలు ఎగవేసినట్టు తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని విదేశాల్లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా పేర్కొన్నారు. తాను బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాల అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తానని ఇంతకు ముందే చెప్పానంటూ ట్వీట్ చేశారు. మరో ఐదురోజుల్లో భారత్ దాఖలు చేసిన నేరస్తుల అప్పగింత కేసుపై యూకే కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలోనే.. అక్కడ తలదాచుకుంటున్న మాల్యా à°ˆ మేరకు స్పందించడం గమనార్హం.
 
‘‘ప్రభుత్వ బ్యాంకుల్లోని సొమ్ములను తీసుకుని పారిపోయాడంటూ నన్ను ఎగవేతదారుగా చూపించేందుకు రాజకీయ నేతలు, మీడియా నిత్యం à°…à°°à°¿à°šà°¿ గోలపెడుతున్నారు. ఇదంతా అబద్ధం. రుణాలను పూర్తిగా చెల్లించేందుకు నేను కర్ణాటక హైకోర్టు ముందు చేసిన ప్రతిపాదనపై ఇంతే గట్టిగా ఎందుకు మాట్లాడరు?’’ అని మాల్యా ప్రశ్నించారు. ‘‘ఏటీఎఫ్ ధరలు అధికంగా ఉన్న కారణంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడినమాట వాస్తవమే. బ్యారెల్‌కు 140 డాలర్ల మేర అత్యధిక క్రూడాయిల్ ధరలు ఎదుర్కొన్న అద్భుతమైన విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్. విపరీతమైన నష్టాల కారణంగా బ్యాంకుల సొమ్ము ఖర్చయిపోయింది. వాళ్లకు 100 శాతం అసలు మొత్తాన్ని ఇస్తానని చెప్పాను. దయచేసి తీసుకోండి..’’ అని మాల్యా ట్విటర్లో కోరారు.
 
 
మూడు దశాబ్దాలుగా భారతదేశంలోనే అతిపెద్ద ఆల్కహాలిక్ బేవరేజ్ గ్రూప్‌à°—à°¾ ఉన్న తాము పన్నుల రూపంలో వేలాది కోట్లు చెల్లించామన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సైతం ఆయా దేశాలకు విశేషంగా తోడ్పడిందని పేర్కొన్నారు. ‘‘ఎయిర్‌లైన్స్ నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమే. అయినా నేను బ్యాంకులకు ఎలాంటి నష్టం లేకుండా మొత్తం చెల్లిస్తానని చెప్పాను. తీసుకోండి ప్లీజ్..’’ అని మరో ట్వీట్‌లో మాల్యా విజ్ఞప్తి చేశారు. కాగా తనను పరారీ ఆర్ధిక నేరగాడిగా ప్రకటించాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే విధించాలన్న మాల్యా విజ్ఞప్తిని ముంబై ప్రత్యేక కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.