నా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే రోడ్డుపై నిలబెడతా

Published: Friday December 07, 2018
తాను చేసుకున్న పెళ్లిళ్ల గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌, à°† పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, తన జోలికి వస్తే వారిని రోడ్డుపైకి తెచ్చి నిలబెడతానని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో ఐదోరోజు పర్యటనలో భాగంగా ఆయన గురువారం సాయంత్రం గుంతకల్లులో మూతబడిన ఏసీఎస్‌ మిల్లు ఎదుట బహిరంగ సభను నిర్వహించారు. అంతకుముందు అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. తన ఆరోగ్యం సరిగా లేదని.. జ్వరంతో బాధపడుతున్నానని వెల్లడించారు.
 
 
‘జగన్‌పై కోడికత్తితో దాడి జరిగితే టీడీపీవారు ఆయన తల్లిపై అభాండాలు వేశారు. నేను తీవ్రంగా వ్యతిరేకించాను. జగన్‌ తల్లిని నేను గౌరవించాను. కానీ ఆయన నా వివాహాలను అడ్డుపెట్టుకుని తిడుతున్నారు. జగన్‌ జైలుకెళ్లడానికి నేనే కారణమా? రాష్ట్ర విభజనకు, అవినీతికి అన్నిటికీ నేనా కారణమా.. ఏం పిచ్చిపిచ్చిగా ఉందా. నా జోలికి వస్తే నడిరోడ్డుపై నిలబెడతా జాగ్రత్త’ అని తేల్చిచెప్పారు. వైసీపీకి ఓటేయకుంటే ప్రజలనైనా తిడతారా అని నిలదీశారు. తాను అందరికంటే ఎక్కువ తెగించానని, అధికార, ప్రతిపక్ష పార్టీలను ఎదిరించడానికి రోజూ చచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతున్నానని చెప్పారు. తనను సీఎం చేసేంతవరకూ ఏమీ చేయనని జగన్‌ అంటున్నారని, మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు అడుగుతున్నారని.. ప్రజల ఆకాంక్షలు మాత్రం వీరికి పట్టడంలేదని విమర్శించారు.
 
 
రాయలసీమ నుంచి à°Žà°‚à°¤ మంది ముఖ్యమంత్రులు అవుతున్నా ఇక్కడి దుస్థితిని మాత్రం మార్చలేకపోయారన్నారు. రెయిన్‌గన్లకు రూ.300 కోట్లు, కుంటల కోసం రూ.1000 కోట్లు ఖర్చుచేశారని, పర్సెంటేజీల కోసమే వాటిని అప్పటికప్పుడు చేపట్టి పక్కనపెట్టారని ఆరోపించారు. రాయలసీమది ముఠా సంస్కృతి కాదని, ఇక్కడి నుంచి తరిమెల నాగిరెడ్డి, వీరబ్రహ్మం, వెంగమాంబ, కట్టమంచి లాంటి ఆదర్శవంతులెందరో పుట్టుకొచ్చారన్నారు. గుంతకల్లులో ఏసీఎస్‌ మిల్లు మూతబడి ఎందరో రోడ్డుమీదపడ్డా ఏ ఒక్క ప్రభుత్వమూ తెరిపించలేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబుకు రాయలసీమ పౌరుషమే ఉంటే మిల్లును తెరిపించాలని, కార్మికుల బకాయిలు చెల్లించాలని సవాల్‌ విసిరారు. లేదంటే తాను అధికారంలోకి వచ్చాక తెరిపిస్తానని, గుంతకల్లులో పరిశ్రమలను నెలకొల్పుతానన్నారు.