సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రోన్‌ల ఏర్పాటు

Published: Saturday December 08, 2018
విమానయాన శిక్షణ, పరిశోధన కోసం దొనకొండలో à°“ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డ్రోన్‌à°² పరీక్షల నిర్వహణను కూడా à°ˆ కేంద్రంతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అమెరికా కేంద్రం ఎన్‌3à°Žà°‚ సొల్యూషన్స్‌ సంస్థను నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రుడు ఎన్‌.మహేశ్‌- యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సంయుక్తంగా రూపొందించిన లాంగ్‌ రేంజ్‌ డ్రోన్‌ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు.
 
ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్‌ కార్పొరేషన్‌తో కలసి ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న à°ˆ సంస్థ రూపొందించిన డ్రోన్‌ ఒకేసారి వంద కిలో మీటర్ల దూరం ప్రయాణించగలదు. ఏడున్నర à°—à°‚à°Ÿà°² పాటు నిరాఘాటంగా ప్రయాణించే à°ˆ డ్రోన్‌ వ్యవసాయం, వాతావరణం వంటి ముఖ్యమైన అవసరాలకు వినియోగించవచ్చని మహేశ్‌ వెల్లడించారు. దీనిని మరింత అభివృద్ధి చేసి వివిధ ప్రయోజనాలకు వినియోగించేలా రూపొందించాలని సీఎం సూచించారు. సమావేశంలో డ్రోన్‌ కార్పొరేషన్‌ సీఈవో కె.రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.