నష్టాలబాటలో ఆర్టీసీ...

Published: Sunday December 09, 2018
ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద రవాణా సంస్థ ఇప్పుడు 52వేల మంది ఉద్యోగుల్ని పోషించలేనంటోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి నష్టాలబాటలో నడవలేక పోతోన్న ఏపీఎ్‌సఆర్టీసీ వృథా ఖర్చులు తగ్గించుకునే పేరుతో సిబ్బంది భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుండటంతో అటు ఉద్యోగులతోపాటు ఇటు కార్మికుల్లో ఆందోళన నెలకొంది. యాజమాన్యం తీరును నిరసిస్తూ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఏకంగా సమ్మెకు దిగబోతోంది. దీంతో ఏపీఎ్‌సఆర్టీసీ అధికారుల్లో ఒక్కసారిగా ఉలికిపాటు మొదలైంది. కార్మికులతోపాటు సెక్యూరిటీ సిబ్బంది, సూపర్‌ వైజర్లు సైతం సమ్మెకు మద్దతిచ్చేందుకు సిద్ధమవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరింత వేడి పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1.23లక్షల మంది ఉద్యోగులతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రజా రవాణా సంస్థగా వెలుగోందిన ఏపీఎ్‌సఆర్టీసీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 62వేల మంది సిబ్బందితో మిగిలింది.
 
à°—à°¡à°¿à°šà°¿à°¨ నాలుగేళ్లలో క్రమంగా తగ్గుతూ వచ్చి ప్రస్తుతం 52వేలకు చేరుకుంది. బస్సుల సంఖ్య 12,500 నుంచి 10 వేల దిగువకు పడిపోయింది. ఆర్టీసీ ఎండీగా ఏడు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన సురేంద్రబాబు సంస్థ పరిస్థితిని సమీక్షించి నష్టాలకు కారణాలు డీజిల్‌ ధరల భారమేనని గుర్తించారు. à°ˆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బస్సు చార్జీల పెంచుకోవడం, డీజిల్‌పై ప్రభుత్వం పన్ను తగ్గించడం, ప్రజా రవాణా సంస్థకు ఆర్థిక చేయూత అందించడం అనే మూడు అంశాలను ప్రభుత్వం ముందుంచారు. ప్రయాణికులపై భారం వేసేందుకు ససేమిరా అన్న సీఎం చంద్రబాబు ఆదాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.
 
కొంతమేరకు ప్రయత్నాలు జరిగినా డీజిల్‌ భారం అంతకు మంచి తయారయ్యింది. ‘‘డీజిల్‌పై అదనపు భారం ఏటా రూ.600కోట్లు ఉంటోంది. కార్మికులు, అధికారులు కష్టపడి పనిచేస్తున్నా... ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతోన్నా డీజిల్‌ భారంతో అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాం. ఆర్థికంగా ఆదుకోండి’’ అంటూ ప్రభుత్వాన్ని మరోమారు వేడుకొంది. ‘‘కేంద్రం ఆదుకోవడం లేదు, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంది. మీ తిప్పలు మీరే పడాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో గత్యంతరం లేక సిబ్బంది కుదింపు చర్యలకు à°Žà°‚à°¡à±€ సురేంద్రబాబు నడుం బిగించారు.
 
సిబ్బంది తగ్గింపు...
టిమ్‌లను డ్రైవర్ల చేతికి ఇచ్చి ఇప్పటికే కండక్టర్లను తగ్గించింది. తాజాగా మెకానిక్‌లను, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లను, ఇంజనీరింగ్‌ విభాగంలో సిబ్బందిని తగ్గించేందుకు కసరత్తు ఆరంభమైంది. 1250 మంది ఉన్న సెక్యూరిటీని 300మంది తగ్గించేందుకు సిద్ధమయ్యారు. ‘‘కార్మికులకు పాయింట్ల విధానాన్ని ప్రవేశ పెట్టి ఉద్యోగంపై కత్తి వేలాడ దీశారు. బస్సు ప్రమాదానికి గురైతే డ్రైవర్‌ను రిమూవ్‌ చేస్తున్నారు. బ్రీత్‌ ఎనలైజర్లు తప్పు చూపిస్తున్నా సస్పెండ్‌ చేస్తున్నారు. దీనితో కార్మికుల నుంచి యూనియన్‌కు ఒత్తిడి ఉంటోంది’’ అని à°“ నేత తెలిపారు. ఉద్యోగుల కుదింపుపై à°Žà°‚à°¡à±€ సరేంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలు మానుకోకపోతే గుర్తింపు సంఘంగా ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని ఈయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, పలిశెట్టి దామోదర్‌రావు హెచ్చరించారు.
 
సంస్థలోని అన్ని విభాగాల్లోనూ ఉద్యోగాలు తగ్గిస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే సమ్మెకు వెళతామన్నారు. వేతనాల సవరణపై నాలుగు సమావేశాలు జరిగినా యాజమాన్యం దాటవేత వైఖరినే అవలంబిస్తోందని, ఈ నెల 20 తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.