తెలంగాణ ఎన్నికలు ఆంధ్రాలో వేడి పుట్టించాయి.

Published: Friday December 14, 2018
తెలంగాణ ఎన్నికలు ఇక్కడ కూడా వేడి పుట్టించాయి..ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ సాగింది.. చివరకు ఫలితాల్లో కేసీఆరే హీరో అయ్యారు.. టీఆర్‌ఎస్‌ గెలుపుతో ఇక్కడ కొన్ని పార్టీలు సంబరాలు కూడా చేసుకున్నాయి. కేసీఆర్‌ ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.. ఇవి కొంతమంది కవ్వింపు కోసం చేసినా అభిమానంతో చేసినా వివాదాలకు దారితీస్తున్నాయి. వైసీపీ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు కొన్ని చోట్ల కనిపించడంపై చర్చించుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాహుబలి అంటూ భారీ ఫెక్సీని బుధవారం నరసాపురం బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో à°ˆ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో అందరి చూపు దీనిపై పడింది. కేసీఆర్‌ పెద్ద సైజ్‌ ఫోటో పెట్టి, మధ్యలో వైసీపీ నాయకులు బుడిద అనిల్‌, మేడిద రాము, రెడ్డప్ప చిన్నధవేజీల ఫోటోలు పెట్టారు.
 
ఫ్లెక్సీలో ఎక్కడా పార్టీల పేర్లు ప్రస్తావించలేదు. తెలంగాణ బాహుబలికి శుభాకాంక్షలంటూ పేర్కొన్నారు. రాత్రి వరకు à°ˆ ఫ్లెక్సీ పట్టణంలో హాట్‌ టాఫిక్‌ అయింది. అయితే గురువారం తెల్లవారుజామున ఫ్లెక్సీ కనిపించలేదు. ఎవరు తొలగించారన్న దానిపై తర్జనభర్జనలు జరిగాయి. అనుమతి లేకుండా ఏర్పాటు చేయడం వల్ల పురపాలక సంఘం తొలగించి ఉండవచ్చని దాన్ని ఏర్పాటు చేసిన అభిమానులు భావించారు. అయితే విచారణలో మున్సిపాల్టీలో తొలగించలేదని తేలింది. దీంతో విషయం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. అయితే ఎస్సై మాత్రం పోలీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో ఢిల్లీలో కేజ్రీవాల్‌, యూపీలో మాయావతి గెలిచినప్పుడు వారిని అభిమానించే కొందరు పట్టణంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిని అప్పట్లో ఎవరూ తొలగించలేదు. కేసీఆర్‌ ఫ్లెక్సీనే తీసివేయడంపై చర్చ సాగుతోంది. ఉద్దేశపూర్వకంగానే కొందరు తీయించి వేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాహుబలి పేరుతో ఏర్పాటు చేసిన à°ˆ ఫ్లెక్సీ రాజకీయంగా పట్టణంలో హాట్‌ టాఫిక్‌ అయింది.