సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిన మోదీ

Published: Thursday December 20, 2018
‘రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాంటి అవినీతి జరగలేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరుత్సాహపరిచింది. రూ.30 వేల కోట్ల కుంభకోణంపై బీజేపీ నేతలు సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించారు. అంబానీ కంపెనీని ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా తీసుకోవాలన్న నిర్ణయంతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రధాని హోదాలో మోదీ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు’’ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. సీపీఐ జాతీయ సమితి సమావేశాలు బుధవారం విశాఖలో ప్రారంభమయ్యాయి. à°ˆ సందర్భంగా సురవరం విలేకరులతో మాట్లాడారు. ‘‘మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశానికి తీరని నష్టం జరుగుతోంది. ఆయన హయాంలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగిపోవడం వల్ల వృద్ధిరేటు 11 శాతం నుంచి 10.6 శాతానికి పడిపోయింది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో మోదీ, à°·à°¾ ద్వయాన్ని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం’’ అని తెలిపారు. కాగా, ‘నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశంలో 2019లో జరిగే ఎన్నికలే చివరి ఎన్నికలవుతాయి. మోదీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ప్రధాన రాజ్యాంగ సంస్థలన్నింటినీ తన చెప్పుచేతల్లో పెట్టుకొని నాశనం చేశారు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.