కియా.. వచ్చేసింది

Published: Thursday December 20, 2018

విజయనగరం: à°µà°¿à°¦à±à°¯à±à°¤à±‌ చార్జింగ్‌తో నడిచే కియా కంపెనీ కారు మన జిల్లాకూ వచ్చేసింది. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ బుధవారం టెస్ట్‌ డ్రైవ్‌ చేశారు. à°ˆ కారుకు ఆరు గంటలు చార్జింగ్‌ పెడితే 110 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. కారును సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ, ఈఈఎస్‌ఎల్‌ (ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌) సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించారు. à°ˆ విద్యుత్‌ కారు ధర రూ.11 లక్షలు. దీనిని నెడ్‌క్యాప్‌ సంస్థ జిల్లాలోని ప్రభుత్వ సంస్థలకు ఆరు సంవత్సరాల పాటు లీజు, సేల్‌ ప్రాతిపదికన అందచేస్తుంది. నెలకు రూ.20 వేల చొప్పున ఆరు సంవత్సరాలు చెల్లించాలి. లీజు గడువు ముగిసిన తరువాత కారు సొంతం అవుతుందని నెడ్‌క్యాప్‌ జిల్లా మేనజర్‌ ఐవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. à°ˆ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కిలోమీటరుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చయ్యే కియో కారును అన్ని మున్సిపాలిటీలకు తీసుకుంటామన్నారు. జిల్లాలో అన్ని పెట్రోలు బంక్‌à°² వద్ద విద్యుత్‌ చార్జింగ్‌ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.