‘మధ్య’ పవనాల తాకిడిలో బీజేపీ

Published: Friday December 21, 2018
వాస్తవాన్ని గుర్తించి, అంగీకరించే విజ్ఞత రాజకీయాలలో ఎంతో మందికి ఉండదు. అరుదైన రాజనీతిజ్ఞుడు అటల్‌ బిహారీ వాజపేయి. ‘వెలుగుతున్న భారతం’లోని చీకటి క్షేత్రాలను ఆయన ముందుగానే దర్శించారు. 2004లో సార్వత్రక ఎన్నికలు ఆసన్నమయిన తరుణంలో లక్నోలో à°’à°• విషాద ఘటన సంభవించింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చీరలు తీసుకొనే క్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 21 మంది పేద మహిళలు చనిపోయారు. à°† మరుసటి రోజు నాకు ఇచ్చిన à°’à°• ఇంటర్వ్యూలో ‘లక్నో సంఘటనతో భారత్‌ పురోగమన కాంతులు మసక బడ్డాయని’ ప్రధానమంత్రి వాజపేయి అంగీకరించారు. ‘వెలిగిపోతున్న భారత్‌లో చీకటి క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. à°ˆ కఠోర వాస్తవం పట్ల మాకు కలవరం కలిగిస్తోంది’ అని తన సహజసిద్ధ యోచనామగ్నతతో వాజపేయి అన్నారు. à°† సార్వత్రక ఎన్నికలలో బీజేపీ పునర్విజయం సాధించగలదని అందరూ నిశ్చితంగా భావిస్తున్న తరుణంలో జాతి భాగ్యవిధాతగా ఉన్న à°† రాజనీతిజ్ఞుడు తన సొంత పరిమితులను గ్రహించారు.
 
నరేంద్ర మోదీ, అటల్జీ కాదు. భారతీయ జనతా పార్టీ పాలనను తీసుకువచ్చిన తొలి ప్రధానమంత్రికి à°’à°• తాత్వికుని ఆలోచనామగ్నత, à°’à°• కవి ద్రష్టత్వం ఉన్నాయి. ప్రజాశ్రేయస్సు గురించి వాజపేయి సదా మథనపడేవారు. ఆయన వారసుడైన నరేంద్రమోదీకి ఆత్మ సంశయమనేది ఏ మాత్రం లేదు. తన నిర్ణయాలు ప్రజలకు నిజంగా మేలు చేస్తున్నాయా అనే విషయమై మోదీ మథనపడడం అరుదు. మోదీ యుగంలో రాజకీయాలు వాజపేయి శకంలోని రాజకీయాలకు భిన్నమైనవి. ఇప్పుడు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం అనిశ్చితి కన్పించినా అది నాయకుని బలహీనతకు సూచనగా పరిగణించడం జరుగుతోంది. ఏదైనా à°’à°• విషయంలో వైఫల్యాన్ని అంగీకరించడమంటే అధినేత, కాదు, సర్వాధినేత అజేయత్వానికి తీవ్ర విఘాతంగా భావిస్తున్నారు! కనుకనే మూడు హిందీ భాషా రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ చేతిలో బీజేపీ పరాజయాలకు దారితీసిన తప్పిదాలను ఆమోదించడానికి పార్టీ నాయకత్వం, కనీసం బహిరంగంగానైనా ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాల గురించి జరగవలసిన చర్చ జరగనేలేదు. అసలు à°† ఎదురు దెబ్బల గురించి ప్రస్తావనే రాకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ à°·à°¾, పార్టీ అధికార ప్రతినిధులు ఎంతకూ రాఫెల్‌ కుంభకోణం పై సుప్రీంకోర్టు తీర్పు పుణ్యంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రథమ కుటుంబంపై తీవ్ర విమర్శలను మరింత ఉధృతంగా చేశారు. పెద్ద విలువ à°—à°² కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు సమాజంలోని పలు వర్గాల వారిని తీవ్ర చిక్కుల పాలు చేశాయన్న ఆక్షేపణలను అగ్రనాయకులు పూర్తిగా కొట్టి పారేశారు. గణాంకాలను తెలివిగా ఉటంకిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించుకొచ్చారు.
 
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం, పార్టీ ఓటమి గురించి బీజేపీ నాయకులు ఇస్తున్న వివరణలు, చేస్తున్న వాదనలు à°† పరాజయాలు తాత్కాలికమైనవి మాత్రమేనని, పెద్దగా పట్టించుకోవల్సిన పని లేదని సూచిస్తున్నాయి. రాజస్థాన్‌లో ఓటమి ప్రభుత్వ వ్యతిరేకత పర్యవసానం కాగా, మధ్యప్రదేశ్‌లో పదిహేనేళ్ళు వరుసగా అధికారంలో ఉండి కూడా ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని కేవలం స్వల్ప తేడాతో మాత్రమే ఓడిపోయామని బీజేపీ నాయకులు అంటున్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భావిస్తామని ఘంటా పథంగా చెప్పి, కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందడాన్ని కూడా బీజేపీ నాయకులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. à°ˆ ఓటమి వారినేమీ కలవర పరచలేదు. à°† రాష్ట్రంలో ‘ప్రాంతీయ’ పవనాలు బలంగా వీచాయని వారు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ అవకతవకలకు పార్టీ ఓటమికి దారితీశాయని పాక్షికంగా అంగీకరించినా 2019 లోక్‌సభ ఎన్నికలలో à°† రాష్ట్రంలో తమ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండగలదని బీజేపీ దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.