మేకప్ వేయాలంటే ప్రాణం ఉండాలిగా’

Published: Sunday December 23, 2018

అందానికి ప్రాధాన్యమిస్తూ మహిళలు వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోకపోవడంపై తమిళనాడు రవాణా మంత్రి విజయభాస్కర్ వివాదాస్పన వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలు ప్రాణం కంటే మేకప్‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ముఖానికి వేసుకున్న మేకప్‌ పాడవుతుందని, శిరోజాల అందం తగ్గుతుందని హెల్మెట్లు ధరించక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా హెల్మెట్లు ధరించకపోవడం మంచిది కాదు’ అని తమిళనాడు రవాణా మంత్రి విజయభాస్కర్ కామెంట్ చేశారు. కాగా ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించాలి. నాలుగుచక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించాలి. డ్రైవింగ్‌ సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదు. à°ˆ నిబంధనలను ఉల్లంఘిస్తే ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించి చలాన్లు విధిస్తుంటారు. అయితే మహిళలు హెల్మెట్ ధరిస్తే తమ కురులు పాడైపోతాయని ఆరోపిస్తుంటారు. పైగా à°ˆ విషయమై ట్రాఫిక్ పోలీసుల దగ్గరకూడా వాదనలకు దిగిన ఉదంతాలున్నాయి. à°ˆ నేపధ్యంలోనే తమిళనాడు రవాణా మంత్రి à°ˆ విధమైన వ్యాఖ్యలు చేశారు.