జీఎస్టీ తగ్గినా థియేటర్లలో ప్రేక్షకులకు ఊరట ఏదీ?

Published: Wednesday January 02, 2019
సినిమా ప్రదర్శనలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రభుత్వం తగ్గించినా జిల్లాలో దానిని ఏ థియేటర్‌లోనూ అమలు చేయలేదు. జీఎస్టీ ధరను 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జనవరి à°’à°•à°Ÿà°¿ నుంచి అమలుచేయాలని ఆదేశించింది. à°ˆ మేరకు మంగళవారం నుంచి సినిమా ప్రదర్శనలకు సంబంధించి టికెట్‌ ధర తగ్గాల్సి ఉంది. కాని ఏ అధికారి పట్టించుకోక పోవడంతో థియేటర్ల యాజమాన్యాలు ఖాతరుచేయలేదు. దీంతో గతంలో ఉన్న పాత ధరలనే వసూలు చేస్తున్నారు. కేంద్ర నిర్ణయంతో టికెట్‌ ధర తగ్గుతుందని భావించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. జీఎస్టీ పన్ను తగ్గింపు నిర్ణయం అమలు చేసిన తొలిరోజే యాజమాన్యాలు తూట్లు పొడిచాయ న్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా సుమారు 60 సినిమా థియేటర్లు ఉండగా జిల్లా కేంద్రంలో 9 ఉన్నాయి. దాదాపు 50 శాతం పైగా థియేటర్లలో రూ.100కు మించి టికెట్‌ ధర వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేసిన టికెట్లపై 18 నుంచి 12 శాతం జీఎస్టీ తగ్గింది. అంటే 6 శాతం జీఎస్టీ తగ్గాల్సి ఉన్నా థియేటర్ల యాజమాన్యాలు అమలు చేయకపోవడం దా రుణమని, ప్రేక్షకుల దోపిడీ వైఖరికి ఇది అద్దం పడుతోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
 
జీఎస్టీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం నగరంతోపాటు రాజాం, పాలకొండ, పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, నరసన్నపేట పట్టణాల్లోని థియేటర్లలోనూ ధర తగ్గింపునకు నోచుకోలేదు. ఇప్పటికైనా జీఎస్టీ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి కేంద్ర నిర్ణయాన్ని అమలు చేసి ప్రేక్షకులకు à°Šà°°à°Ÿ కలిగించేలా చర్యలు తీసుకోవాలని పలువురు ప్రేక్షకులు కోరుతు న్నారు. దీనిపై శ్రీకాకుళం సినీ ఎగ్జిబిటర్ల సంఘం ప్రతినిధి మండవల్లి రవి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా తాము ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించి అమలు చేస్తామని, ప్రేక్షకులపై భారం మోపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.