గొంతు సవరించుకొన్న కొత్త న్యాయస్థానం

Published: Thursday January 03, 2019
 à°¨à°µà±à°¯à°¾à°‚ధ్ర సర్వోన్నత న్యాయస్థానం తన గంభీర స్వరాన్ని సవరించుకొంది. కిక్కిరిసిన ప్రధాన కోర్టు హాలులో, న్యాయవాదుల హర్షాతిరేకాల మధ్య తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ తొలిరోజు విధులను ప్రారంభించింది. జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ మల్లవో లు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ ప్రక్రియను బుధవారం లాంఛనంగా మొదలుపెట్టింది. విశాఖ అక్రమ కట్టడాలపై దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు తొలి కేసుగా విచారించింది. స్థానికతను ఎత్తిపడుతూ, తెలుగులో ఉన్న పిటిషన్‌ విచారణకు రావడం గమనార్హం. మొదటిరోజు మొత్తం పది కోర్టు హాళ్లూ పని చేశాయి. 42 కేసులను విచారించి, అందులో 2 కేసులను హైకోర్టు తోసిపుచ్చింది.
 
 
న్యాయమూర్తుల పరిశీలన కోసం 1,160 పిటిషన్లు దాఖలయ్యాయి. à°’à°• కేసును మాత్రం లోక్‌ అదాలత్‌కు రిఫర్‌ చేశారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసిన తాత్కాలిక హైకోర్టు హాళ్లను మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే, ఇక్కడే బుధవారం విధులు ప్రారంభించారు. తొలిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలోని 14 మంది న్యాయమూర్తులు కోర్టు హాలులో సమావేశమయ్యారు. à°ˆ సమావేశానికి అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, ఏపీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ à°—à°‚à°Ÿà°¾ రామారావు, ఏపీ న్యాయవాదుల సంఘం చైర్మన్‌ రామన్నదొరతో పాటు పలువురు సీనియర్‌ న్యాయవాదులు హాజరయ్యారు.
 
 
వారిని ఉద్దేశించి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటు కావడం ముదావహమన్నారు. అనేక సమస్యలు మన ముందున్నాయని, వాటిన్నింటినీ అధిగమించాల్సి ఉందన్నారు. కాగా, హైకోర్టు లో తొలిగా విశాఖపట్నంలోని అక్రమ కట్టడాలపై దాఖలయిన కేసుపై విచారణ జరిగింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. విశాఖపట్నం బీచ్‌రోడ్డులో కోస్ట ల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలకు విరుద్ధంగా గాజుల శోభారాణి అనే యువతి భవనం నిర్మించారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రతివాది తరఫున గడువు కావాలని కోరడంతో తదుపరి విచారణను 4à°µ తేదీకి వాయిదా వేశారు.