బాబుపై చుక్కల భూముల పేరుతో కుట్ర!

Published: Thursday January 03, 2019
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై కొత్తకుట్రకు ప్రయత్నం జరుగుతోందని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. à°ˆ కుట్రలో ప్రభుత్వంలోని ముగ్గురు ఉన్నతాధికారులు, à°“ మాజీ మంత్రి పాత్ర ఉందని తెలిపారు. బుధవారమిక్కడి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘టీడీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలన్న కుట్రలో భాగంగా చుక్కల భూముల (22 ఏ జాబితా) పేరుతో రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పాలని చూస్తున్నారు. à°ˆ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది ఓటర్లు అధికార పార్టీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. à°ˆ భూములు రైతులవేనని, వాటి రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలిగించవద్దని సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. సంబంధిత అధికారులు పెడచెవిని పెడుతున్నారు.
 
ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న కుట్రలో భాగంగా ఓటర్లను అధికార పార్టీకి దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి దీనికి బాధ్యులైన అధికారుల పేర్లు అందిస్తాను. à°ˆ భూముల సమస్యను సంక్రాంతిలోగా పరిష్కరించకుంటే ఆమరణ దీక్షకు దిగుతా’ అని హెచ్చరించారు. ప్రతిపక్షంలో చేరిన ప్రభుత్వ వ్యతిరేక రిటైర్డ్‌ అధికారులతో కొందరు ఉన్నతాధికారులు కుమ్మకై చంద్రబాబును దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
 
దర్శకుడు రాంగోపాల్‌వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాపై శివాజీ మాట్లాడుతూ.. ఆయన వెన్నుపోటుకు, వెన్నుదన్నుకు తేడా తెలియని వ్యక్తి అని వ్యాఖానించారు. లక్ష్మీపార్వతి చెర నుంచి టీడీపీని కాపాడేందుకు ఎన్టీఆర్‌ను చంద్రబాబు దించాల్సి వచ్చిందన్నారు. ‘ఆయన à°† నిర్ణయం తీసుకుని ఉండకపోతే ఈరోజు టీడీపీ ఉండేది కాదు. ఆయన నిర్ణయాన్ని నాడు కేసీఆర్‌, ఎర్రబెల్లి దయాకరరావు లాంటి నేతలు సమర్థించారు.
 
ఎన్టీఆర్‌ను దించి పార్టీని రక్షించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచి.. టీడీపీని గెలిపించడం ద్వారా ఆయన చర్యను సమర్థించారు’ అని పేర్కొన్నారు. ఆయన నిర్ణయం వల్లే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, వాజ్‌పేయి ప్రధాని కాగలిగారని చెప్పారు. నాడు టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బాబును వెన్నుపోటుదారుగా చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. వైస్రాయ్‌ హోటల్‌ వద్ద ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరింది లక్ష్మీపార్వతి మనిషేనని, దానికి తానే ప్రత్యక్ష సాక్షినని తెలిపారు.