చంద్రబాబే మాట మార్చారు

Published: Saturday January 05, 2019

‘నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రూ.3500 కోట్లు ఇచ్చాం. కానీ... అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేదు’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా నిధులు కేటాయిస్తామని సీఎం చంద్రబాబుకు చెప్పామని... అందుకు ఆయన తొలుత అంగీకరించి తర్వాత మాటా మార్చారని తెలిపారు. శుక్రవారం ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు జైట్లీని కలిశారు. à°ˆ సందర్భంగా హామీల్లో చాలా మటుకు నెరవేర్చామని జైట్లీ చెప్పగా.. 90 శాతం హామీలను నెరవేర్చాల్సి ఉందని హోదా సాధన సమితి నేతలు గుర్తు చేశారు. రాజధానిలో 90 శాతం మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులివ్వాలని విభజన చట్టంలో ఉందని చలసాని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వెనుకబడి ప్రాంతాలకు నిధులను ఇవ్వడం లేదని సీపీఐ నేత రామకృష్ణ గుర్తు చేయగా... రూ.350 కోట్లే ఇవ్వాల్సి ఉన్నదని, వాటిని విడుదల చేస్తామని జైట్లీ జవాబిచ్చారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ... పైసా కూడా ఇవ్వలేదని సభ్యులు గుర్తు చేశారు.