మంత్రి పుట్టరంగశెట్టి రాజీనామాకు బీజేపీ డిమాండ్‌

Published: Sunday January 06, 2019
సచివాలయం వద్ద సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పుట్టరంగశెట్టి కార్యాలయంలో టైపిస్టుగా పనిచేస్తున్న ఉద్యోగి మోహన్‌ వద్ద పట్టుబడ్డ రూ.25.76 లక్షల నోట్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తాను అధికారంలోకి వస్తే సచివాలయంలోకి అవినీతి పరులను దూరంగా ఉంచుతానని బాకాలు ఊదిన ముఖ్యమంత్రి కుమారస్వామి స్వయానా తన కేబినెట్‌లోని మంత్రి పుట్టరంగశెట్టి వ్యవహారంలో నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ వ్యాఖ్యానించింది.
 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎస్ .యడ్యూరప్ప శివమొగ్గలో శనివారం మీడియాతో మాట్లాడుతూ à°ˆ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని à°¡à°¿ మాండ్‌ చేశారు. టైపిస్టు మోహన్‌ను సస్పెండ్‌ చేయడం ద్వారా à°ˆ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో à°ˆ ఘటన నిరూపిస్తోందన్నారు. à°’à°• సామాన్య టైపిస్టు ఉద్యోగి వద్ద లక్షలాది రూపాయలు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. కంట్రాక్టర్‌ ద్వారానే భారీ మొత్తాన్ని లంచంగా అందేందుకు ఉద్దేశించిందని à°† యన అనుమానం వ్యక్తం చే శారు. కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు నగరంలో మీడియాతో మాట్లాడుతూ నోట్ల కట్టల వ్య వహారంలో ప్రభుత్వం తక్షణం స్పందించి ఇందుకు బాధ్యుడైన మోహన్‌ను సస్పెండ్‌ చేసిందన్నారు. పోలీసులు à°ˆ మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. నగదు ఎవరికి సంబంధించిందనే అంశం దర్యాప్తు అనంతరమే బయటపడుతుందన్నారు. ప్రతి విషయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
 
హుబ్బళ్ళిలో మీడియాతో మాట్లాడిన హోంశాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ కూడా మంత్రి పుట్టరంగశెట్టిని గట్టిగా వెనుకేసుకొచ్చారు. టైపిస్టు చేసిన తప్పుపై మంత్రిని ఎలా బాధ్యుడిని చేస్తామని ప్ర శ్నించారు. దర్యాప్తు పూర్తయ్యేంతవరకు అయినా బీజేపీ నేతలు సహనం పాటిస్తే మంచిదని చురకలంటించారు. మరోవైపు ఆశ్చర్యకరంగా జేడీఎ్‌సకు చెందిన విధానపరిషత్‌ మాజీ సభాపతి బసవరాజ్‌ హొరట్టి కూడా మంత్రి పుట్టరంగశెట్టి రాజీనామా చేస్తే మంచిదని సూచించడం గమనార్హం. కాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పుట్టరంగశెట్టి రాజీనామా చేసేంతవరకు తీవ్ర పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. సచివాలయం వద్ద à°ª ట్టుబడ్డ నగదుతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పిన మంత్రి శనివారం మీడియాకు అందుబాటులో లేకుండా పోయారు.