ప్రపంచ రికార్డు బాటలో పోలవరం

Published: Sunday January 06, 2019
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం నమోదవుతోంది. తన రికార్డులను తానే తిరగరాసేందుకు à°ˆ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. అతి భారీ కాంక్రీట్‌ విన్యాసం ద్వారా గిన్ని్‌సబుక్‌లోకి ఎక్కనుంది. చైనాలోని త్రీగార్జెస్‌ ప్రాజెక్టు కాంక్రీట్‌ పనుల రికార్డును ‘పోలవరం’ ఇప్పటికే అధిగమించింది. తాజాగా దుబాయ్‌లోని అబ్దుల్‌ వాహిద్‌ బిన్‌ షబీబ్‌ , రాల్స్‌ నిర్మాణ సంస్థ నిర్మించిన 21,580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులను అధిగమించేందుకు నవయుగ ఇంజనీరింగ్స్‌ సిద్ధమైంది. ఆదివారం ఉదయం ఏడు గంటలకు à°ˆ అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు. అప్పటినుంచి సోమవారం ఉదయం ఆరు à°—à°‚à°Ÿà°² లోపు 28,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అదే జరిగితే ‘నవయుగ’ మరో ప్రపంచ రికార్డును ఛేదించినట్టే!
 
రికార్డుకిదే గీటురాయి..
à°ˆ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు సంస్థ ప్రతినిధి రిషినాథ్‌ బృందం శుక్రవారం సాయంత్రమే పోలవరం చేరుకొంది. స్వతంత్రంగా వచ్చిన సివిల్‌ ఇంనీరింగ్‌ ప్రతినిధులు, జాతీయ మీడియా సంస్థలు, స్థానిక మీడియా సంస్థలతో à°ˆ ప్రాంతం సందడిగ మారింది. à°ˆ అద్భుత క్షణాల కోసం ఉత్సుకతతో వీరంతా ఎదురుచూస్తున్నాయి. వీరందరి కోసం ప్రాజెక్టు స్థలంలో తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేశారు. ప్రపంచ రికార్డు నమోదులో భాగంగా గిన్నిస్‌ బృందం కాంక్రీటు ప్రతి గంటకు à°Žà°‚à°¤ వేస్తున్నారనేది పరిగణనలోకి తీసుకొంటుంది. à°† వివరాలను ఎప్పటికప్పుడు టెలి వీడియోల ద్వారా లండన్‌లోని కేంద్ర కార్యాలయానికి చేరవేస్తుంది. కాంక్రీటు వేసే దృశ్యాలను ప్రతి 15 నిమిషాలకు ఒకసారి రికార్డు చేస్తారు. à°ˆ బృందంలోని ఎనిమిదిమంది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు.