బడి మానేసిన 100 మంది విద్యార్థులు

Published: Thursday January 10, 2019
 à°¤à°® à°Šà°°à°¿ విద్యార్థినులను వేధించినందుకు నిరసనగా పల్లెపాలం గ్రామపెద్దలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బాలికలను వేధించిన బడుద్ధాయిలకు బుద్ది చెప్పే వరకూ తమ పిల్లలను బడికి పంపకూడతని తీర్పు చెప్పారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని మత్స్యకార గ్రామమైన పల్లెపాలెంలో బుధవారం à°ˆ ఘటన చోటుచేసుకుంది. దీనికి కట్టుబడిన పల్లెపాలెం గ్రామస్థులు పెదగంజాం హైస్కూల్‌లో చదువుతున్న 100 మందిని బడి మాన్పించారు. విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు గ్రామానికి వెళ్లి మాట్లాడగా ఉన్నతాధికారులు, పోలీసులు స్పందించి తమ పిల్లల భద్రతకు భరోసా ఇచ్చే వరకూ బడికి పంపబోమని తేల్చి చెప్పారు.
 
చినగంజాం మండలం పెదగంజాంకు కూతవేటు దూరంలో ఉన్న పల్లెపాలెం గ్రామానికి చెందిన సుమారు 100 మంది విద్యార్థులు పెదగంజాం హైస్కూల్‌లో చదువుకుంటున్నారు. వారిలో 30 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. మంగళవారం సాయంత్రం స్కూలు నుంచి వస్తున్న 14 మంది విద్యార్థినులను పెదగంజాంకు చెందిన కొందరు ఆకతాయిలు అసభ్యకర మాటలతో టీజ్‌ చేశారు. à°“ విద్యార్థిని ఎదురు తిరగడంతో యాసిడ్‌ పోస్తామంటూ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఇంటికొచ్చాక విద్యార్థినులు విషయం à°Šà°°à°¿ పెద్దలకు చెప్పారు. వారు పెదగంజాం పెద్దలతో మాట్లాడి, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభంలేకపోయింది. దీంతో పిల్లల భద్రతపై పోలీసులు, అధికారులు భరోసా కల్పించే వరకూ బడికి పంపరాదని తీర్మానించారు. కాగా ఆకతాయిల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.