మోదీ మనసు మారడమే ముఖ్యం...

Published: Friday January 11, 2019
 à°µà°¿à°­à°œà°¨ జరిగిన తొలి ఏడాది రెవెన్యూ లోటు నుంచి ప్రత్యేక హోదా అమలు దాకా... రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. à°ˆ విషయంలో రాష్ట్రం ఆది నుంచీ ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రంతో à°’à°• విధంగా యుద్ధమే చేస్తోంది. ఒకవైపు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూనే... వీలైనన్ని ఇతర మార్గాల్లో నిధులు సమీకరించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ, రాయితీలు, విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన నిధులు... ఇలాంటివి పక్కనపెట్టినా... స్పష్టమైన ఆర్థిక హామీలకు సంబంధించిన నిధులే రూ.32వేల కోట్లు కేంద్రం నుంచి అందాల్సి ఉంది. 2014-15 రెవెన్యూ లోటు రూ.16,000 కోట్లుగా నిర్ధారించినా... కేంద్రం రూ.3,979 కోట్లు మాత్రమే ఇచ్చింది. à°ˆ ఖాతాలో రూ.12 వేల కోట్లు రావాలి. పోలవరంపై ఖర్చు పెట్టిన సొమ్ము, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినవి, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇవ్వాల్సిన 90ు నిధులను కూడా కలిపితే కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.32,000 కోట్లు తక్షణం రావాల్సి ఉందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.
 
‘‘విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు విడుదల చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ... ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలి’’ అని కేంద్రంలోని అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా వారు అదే మాట చెబుతున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నారు. వెరసి... మనకు à°† సొమ్ములు దక్కాలంటే... మోదీ వైఖరి మారాలి, లేదా ఆయనస్థానంలో ‘ఏపీ అనుకూల’ ప్రధాని రావాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 
‘‘కొత్త రాష్ట్రంలో ఏ ఖర్చునూ వాయిదా వేయలేం. మరోవైపు... ప్రతిదీ కొత్తగా సమకూర్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ! à°ˆ పరిస్థితుల్లో నగదు నిర్వహణ భారంగా మారింది. కేంద్రం సహకరించి విభజన చట్టం-సంబంధిత హామీల ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులు సక్రమంగా వచ్చి ఉంటే రాష్ట్రానికి అప్పుల కష్టాలు తప్పేవి’’ అని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. రెవెన్యూ లోటును యథాతథంగా ఆమోదించి ఉంటే... రైతు రుణమాఫీ సులువయ్యేది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం దీనిని విడతల వారీగా అమలు చేస్తోంది. 4, 5 విడతల రుణమాఫీ కోసం కూడా రుణాల వేటలో ఉంది.