భోగి మంటల వెలుగుల్లో నవ్యాంధ్ర

Published: Wednesday January 16, 2019
భోగి మంటల వెలుగుల్లో నవ్యాంధ్ర కొత్త సంతోషాలను అద్దుకొంది. చుక్క పొద్దునే లేచి చలి మంటల సెగలో హుషారెత్తిన ఉత్సాహంతో రోజంతా ప్రజలు ఆటలు, సరదాలతో గడిపారు. పండక్కి తరలివచ్చిన కుటుంబాలతో ఊళ్లూ, లోగిళ్లూ కొత్త కాంతులు సంతరించుకొన్నాయి. కృష్ణాజిల్లా నాగాయలంకలో పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన పడవల పోటీలు పండగ హుషారు పెంచాయి. పర్యాటక శాఖ రెండు రోజులపాటు నిర్వహించిన à°ˆ పోటీలు సోమవారం ముగిశాయి. రెండేళ్లుగా నిర్వహిస్తున్న à°ˆ వేడుకల్లో ఈసారి డ్రాగన్‌ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. à°ˆ పోటీలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ జెండా ఊపి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో యనమల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌ పోటీలు జరిగాయి. à°ˆ పోటీలను మంత్రి యనమల రామకృష్ణుడు వీక్షించారు. ఇదే జిల్లా అయినవిల్లి మండలం మాగాంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ పండగ జరుపుకొన్నారు.
 
 
అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద హోంమంత్రి చినరాజప్ప భోగి మంటలు వెలిగించారు. ఈసారి పండక్కి విజయనగరంలో బేరాలు జోరుగా సాగాయి. సంక్రాంతి అమ్మకాలతో షాపులు కిక్కిరిశాయి. శ్రీకాకుళం జిల్లా గ్రామాల్లో సింగిడి రాళ్లను ఎత్తే క్రీడలు జోరుగా సాగాయి. వేరే రాష్ట్రాలు, ప్రాంతాల్లో పనులు చేసుకొని బతుకుతున్న మూడు లక్షలమంది ఈ పండక్కి సిక్కోలు చేరుకొన్నారు. రాజాంలో ఏటా జరిపినట్టుగానే ఈసారి కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు కుటుంబం పేదలకు వస్త్రాలను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఆయన కుటుంబ సభ్యులు భోగీ మంటల్లో పిడకలు, కట్టెలు వేశారు. ఇళ్లకు చేరుకొనే అల్లుళ్లూ, కూతుళ్లతో అనంతపురంలో ప్రయాణ కేంద్రాలు కిటకిటలాడాయి. మంత్రి పరిటాల సునీత రామగిరిలోని వెంకటాపురంలో భోగి పండగ జరుపుకొన్నారు.
 
 
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెన్నైలో భోగి పండగ జరుపుకున్నారు. చెన్నై కోట్టూరుపురంలోని కుమార్తె ఇంటివద్ద సోమవారం వేకువజామున వెంకయ్య, కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు రగిలించారు.