1.52 కోట్ల రైతు కుటుంబాలకు మేలు

Published: Monday January 21, 2019
రైతులతోపాటు కౌలు రైతులకూ మేలు జరిగేలా సాగుకు సహాయం అందించడమే లక్ష్యంగా తలపెట్టిన పథకంపై ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఖరీఫ్‌ నుంచే à°ˆ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించిన సంగతి తెలిసిందే. à°ˆ పథకానికి ‘రైతు రక్ష’ అని పేరుపెట్టనున్నట్లు సమాచారం! నగదు రూపంలో అందించే సహాయాన్ని నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని దాదాపుగా à°’à°• నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన విధి విధానాలను సోమవారం కేబినెట్‌లో ఖరారు చేయనున్నారు. రుణమాఫీ అమలు సమయంలో రాష్ట్రంలోని మొత్తం రైతుల సమాచారాన్ని ప్రభుత్వం పక్కాగా నిక్షిప్తం చేసింది. à°ˆ లెక్క ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.30 కోట్ల మంది రైతులున్నట్లు అంచనా! ఇప్పుడు à°ˆ కుటుంబాలన్నింటికీ ‘రైతు రక్ష’ ద్వారా లబ్ధి చేకూరనుంది.
 
మరోవైపు రాష్ట్రంలో ఉండే కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కృష్ణా జిల్లాతో పాటు పలు జిల్లాల్లో à°ˆ కార్డులను అందించారు. బ్యాంకులనుంచి తేలిగ్గా రుణాలు వచ్చేందుకు à°ˆ కార్డులు ఉపయోగపడుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం అందించే సాయం, ఇన్‌పుట్‌ సబ్సిడీవంటి ప్రయోజనాలు సమకూరుతాయి. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైతు రక్ష పథకానికి కూడా à°ˆ కార్డులు ఉపకరిస్తాయి. నిజానికి... నవ్యాంధ్రలో సొంతంగా భూమిసాగు చేసుకునే రైతులకంటే కౌలు రైతులే ఎక్కువగా ఉన్నట్లు అంచనా! కౌలు రైతులను అధికారికంగా గుర్తించేందుకు అనేక సమస్యలున్నాయి. భూమి యజమానికి, కౌలు రైతుకూ మధ్య అధికారికమైన ఒప్పందం ఏదీ ఉండదు. అయినప్పటికీ కౌలు రైతులను గుర్తించి, వారికి కార్డులు జారీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆవాసం కల్పించేలా à°’à°• విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. వీలున్నచోట్ల ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు, స్థలం కొరత ఉన్న చోట్ల అపార్ట్‌మెంట్లకు స్థలాలు ఇచ్చేలా à°ˆ విధానాన్ని రూపొందిస్తారు. ఇక... ఉద్యోగులకు à°’à°• డీఏ బకాయిని చెల్లిస్తూ à°ˆ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అదే సమయంలో అమరావతి పరిధిలో పేదలకు దాదాపు 500ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేయాలన్న ఆలోచన ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలన్న విధానంలో భాగంగా à°ˆ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.