పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

Published: Tuesday January 22, 2019
జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ à°ˆ నెల 27à°¨ గుంటూరు పర్యటనకు రానున్నారు. నగర శివార్లలోని ఇన్నర్‌రింగ్‌ రోడ్‌లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు గుంటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పార్టీ వర్గాలు పవన్‌ టూర్‌ను సోమవారం ధ్రువీకరించాయి. మొదట నిర్ణయించిన ప్రకారం à°—à°¤ సెప్టెంబరు చివరిలోనే పవన్‌ గుంటూరు పర్యటనకు రావాల్సి ఉంది. జిల్లాలో పార్టీ కార్యాలయం ప్రారంభించేందుకు వస్తారని అప్పట్లో నేతలు ప్రకటించినా à°† కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది.
ఈలోపు పవన్‌ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన, ప్రజా పోరాట యాత్రల్లో బిజీగా ఉండటంతో గుంటూరు పర్యటన కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు జనవరి 27à°¨ జనసేనాని గుంటూరు పర్యటనకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఆదివారం సాయంత్రం గుంటూరులో జరిగే భారీ భారీ బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగిస్తారు. బీఆర్‌ స్టేడియంలో లేదా గుంటగ్రౌండ్‌లో సభను నిర్వహించాలని నాయకులు భావిస్తున్నారు. à°’à°•à°Ÿà°¿, రెండు రోజుల్లో వేదికను ఖరారు చేస్తారు.