కాపులను మోసం చేసింది వైఎస్‌

Published: Thursday January 24, 2019
‘‘అగ్రవర్ణాల్లో కాపులు సగానికిపైగా ఉన్నారు. కాపు, తెలగ, బలిజ, à°’à°‚à°Ÿà°°à°¿ కులాల శాతమే అధికం. అందుకే ఆర్థిక బలహీనవర్గాలకు ఇచ్చిన 10 శాతం కోటాలో కాపులకు ఐదు శాతం కేటాయించాం’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ, వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని విమర్శించారు.
 
‘‘ఢిల్లీకి వెళ్లి కాపు రిజర్వేషన్ల గురించి కేంద్రాన్ని అడగలేని అసమర్థులు వారు. కాపులకు మేలు చేసిన టీడీపీని నిందిస్తున్నారు’’ అని మండిపడ్డారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీడీపీ ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జిలు, పార్టీ బాధ్యులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాపు కోటా విషయంలో అగ్రవర్ణాల మధ్య వైసీపీ, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘‘కాపు రిజర్వేషన్‌ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, ఢిల్లీకి పంపాం. దానిపై ఏనాడైనా బీజేపీ, వైసీపీ నేతలు మాట్లాడారా? కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసింది వైఎస్‌. టీడీపీ ఇస్తామంటున్న ఐదు శాతం కోటాపై బీజేపీ, వైసీపీకి ఉన్న అభ్యంతరం ఏమిటి’’ అని చంద్రబాబు నిలదీశారు.