ఆర్టీసీ జేఏసీకి మంత్రి అచ్చెన్న హామీ

Published: Friday January 25, 2019
ఆర్టీసీలో సమ్మెకు ఆస్కారం లేకుండా వేతన సవరణ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. గుర్తింపు సంఘం ఈయూ నేతృత్వంలో ఐక్య కార్యాచరణ కూటమి(జేఏసీ)à°—à°¾ ఏర్పడిన కార్మిక సంఘాల నేతలు గురువారం విజయవాడలో మంత్రితో భేటీ అయ్యారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదని, డీజిల్‌ ధరల పెరుగుదల, పల్లెవెలుగు సర్వీసులపై భారీగా పన్ను, అప్పులకు వడ్డీలు, ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా కారణమని జేఏసీ కన్వీనర్‌ పలిశెట్టి దామోదర్‌రావు, సభ్యులు వైవీ రావు, జిలానీ, శ్రీనివాసరావు తదితరులు వివరించారు.
 
దీనిపై మంత్రి స్పందిస్తూ కార్మికుల కష్టం వల్లే ఆర్టీసీ ఆక్యుపెన్సీ 67శాతం నుంచి 80శాతానికి పెరిగిందన్నారు. à°ˆ నెల 30, 31à°¨ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం జేఏసీ కన్వీనర్‌ దామోదర్‌రావు మాట్లాడుతూ ఫిబ్రవరి 6à°¨ సమ్మెకు పూర్తిగా సంసిద్ధం అవుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 128 బస్‌ డిపోల్లో ఇప్పటికే సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయన్నారు.