ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేద్దాం

Published: Monday January 28, 2019
 à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• హోదా కోసం అందరం కలిసి రావాలంటే వైసీపీ రావడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అన్ని పార్టీలు ఏకమై విభజన సమస్యలపై పోరాటం చేయాలని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మగౌరవం, సమస్యలపై ఏకతాటిపైకి వద్దామని పిలుపిచ్చారు. ఆదివారం గుంటూరులో జరిగిన జనసేన శంఖారావ సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. తొలుత జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకొన్నారు. చిరుజల్లుల్లోనే ఆయన ఉపన్యాసం కొనసాగించారు. ‘ప్రత్యేక హోదాను బీజేపీ నేతలు, ప్రధాని మోదీ మర్చిపోయారు. మనం మర్చిపోలేదు. సీఎం అప్పుడప్పుడూ గజనిలా మర్చిపోతారు. ఆయనకు ఆరు నెలలకోసారి గుర్తుకొస్తుంది. అప్పుడు హోదా అంటూ హడావుడి చేస్తారు. జగన్‌కు అసలు పట్టదు. 29à°¨ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఏర్పాటు చేసిన సభకు జనసేన వెళ్తుంది. విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సింది చాలా ఉన్నాయి. ఉద్యోగాలు, పరిశ్రమలు రావాలి. దీనిని జగన్‌ ఎందుకు మరిచిపోయారు. వైసీపీ వాళ్లు ఆలోచించుకోవాలి. ఎవరికి వారుగా పోటీ చేద్దాం. ఏపీ ప్రజల ఆత్మగౌరవం కోసం ఏకతాటిపైకి వద్దాం. ఆంధ్రుల ఆత్మగౌరవం హస్తినలో పిక్కటిల్లాలి’ అని పేర్కొన్నారు. ఎలాగైతే ఏపీని అడ్డగోలుగా విభజించారో, అలానే ఉత్తరప్రదేశ్‌ని నాలుగు ముక్కలు చేసే రోజు వచ్చి తీరుతుందని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..!
 
à°ˆ రాజకీయ వ్యవస్థకి à°’à°• చంద్రబాబు, à°’à°• జగన్‌ సరిపోరు. 30 ఏళ్లు సీఎంగా ఉండాలని జగన్‌ అంటారు. చంద్రబాబు ఉంటే తాను, లేకుంటే తన బాబు ఉండాలంటారు. ప్రజలకోసం జనసేనని ఏర్పాటు చేశాం. ఆనాడు పీఆర్పీని కాంగ్రె్‌సలో కలిపేసినా నేను నిలకడగా ఉన్నాను.
 
గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్‌ కార్యక్రమం ఏర్పాటు చేస్తే వెళ్లాను. అక్కడ కేసీఆర్‌తో కలిసి మాట్లాడాను. పోరాటం చేసిన వాళ్లు, చట్టసభల్లో పదవుల్లో ఉన్న వారంటే నాకు గౌరవం, సంస్కారం. అంతే తప్పా వారికి తలవంచినట్లు కాదు. నేను ఏ రోజూ ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. నేను అందరిలా మోసం చేయను. ఏమి చేసినా ప్రజలకు చెప్పి, వారి ఆమోదంతోనే చేస్తాను. వెన్నుపోట్ల వ్యక్తిగా, మోసగాడిగా మాత్రం ఉండను. జగన్‌కు ప్రధాని అంటే భయం. చట్టసభలకు వెళ్లి పోరాటం చేయరు. నాకు జగన్‌ మీద ఎలాంటి వ్యక్తిగత కోపతాపాలు లేవు. అయితే వాళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడం వల్లే మాట్లాడాల్సి వస్తోంది.