ప్రతి వెయ్యి బాలురకు 806 బాలికలు

Published: Tuesday January 29, 2019
ఆడపిల్లల ఉనికికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. బాలురతో పోల్చితే, బాలికల జననాల రేటు దేశంలో గణనీయంగా తగ్గిపోతున్నట్టు జాతీయ అధ్యయనాలు చాటుతున్నాయి. అందులోనూ, దక్షిణ రాష్ట్రాల్లో à°ˆ పతనం ఆందోళనకర రీతిలో ఉన్నట్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌జీఐ) వెల్లడించింది. జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లో బాలికల జననాల రేటు నాటకీయరీతిలో పడిపోయిందని వ్యాఖ్యానించింది. దక్షిణ భారతంలో ఒక్క కేరళ మినహా ఇంచుమించూ అన్ని రాష్ట్రాల పరిస్థితీ ఇలాగే ఉన్నదని స్పష్టం చేసింది. అందులోనూ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలో లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం ఉన్నదని వెల్లడించింది. సాధారణంగా లైంగిక నిష్పత్తిలో అసమానత్వం అనగానే, గుర్తొచ్చే రాష్ట్రాలు పంజాబ్‌, హరియాణా. అయితే, తాజా గణాంకాలను బట్టి, à°† రాష్ట్రాలను మించిన అధ్యాన్న పరిస్థితులు దక్షిణాదిలో ఉన్నట్టు ఆర్‌జీఐ పేర్కొంది. 2007-2016 మధ్యకాలానికి సంబంధించిన మగ, ఆడ శిశువుల జననాల నిష్పత్తిని à°ˆ సంస్థ పరిశీలించింది.
 
ప్రతి వందమంది బాలికలకు 105 మంది బాలురు ఉండటాన్ని సహజ లైంగిక జనన నిష్పత్తిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అంటే, ప్రతి వెయ్యిమంది బాలురకు 952 మంది బాలికలు ఉండాలన్న మాట. ఇప్పటిదాకా à°ˆ స్థాయి నిష్పత్తిని ఒక్క కేరళ మాత్రమే నిలబెట్టుకొంటూ వస్తోంది. à°ˆ రాష్ట్రంలో 2016 నాటికి 954 మంది బాలికలు ఉన్నారు. ఇక.. à°† ఏడాది దేశంలోనే అత్యధికంగా 980 మంది బాలికలతో ఛత్తీస్‌గఢ్‌ ముందు నిలిచింది. దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌ అట్టడుగున ఉన్నాయి. ప్రతి వెయ్యి మంది బాలురకుగాను, 806 మంది బాలికలు మన రాష్ట్రంలో ఉన్నట్టు ఆర్‌జీఐ పేర్కొంది. ఇది 2016 నాటి లెక్క. 2007లో ఏపీలో వెయ్యి మంది బాలురకు 974 మంది బాలికలు ఉన్నారు. 168 మందికిపైగా లోటు నమోదయింది.
.
ఆంధ్రప్రదేశ్‌లో జననాల లైంగిక నిష్పత్తిలో నాటకీయ స్థాయిలో లోటు నమోదు అయిందని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వ్యాఖ్యానించింది. దీనిపై జన గణన కార్యక్రమం(ఏపీ) జాయింట్‌ డైరెక్టర్‌ ఎల్‌ఎన్‌ ప్రేమ్‌ కుమారి వివరణ ఇచ్చారు. ఆంధ్ర, తెలంగాణ జనాభా విభజనలో తలెత్తిన గందరగోళం కారణంగానే లోటు భారీగా కనిపిస్తోందని వివరించారు. అయితే, à°ˆ వివరణతో కొందరు నిపుణులు విభేదిస్తున్నారు. విభజన జరిగిన నాటి నుంచి, à°† తరువాత రెండేళ్ల పాటు ఏపీలో లైంగిక నిష్పత్తికి సంబంధించిన గణాంకాల్లో పెద్ద తేడా కనిపించలేదని చెబుతున్నారు.