నేటి నుంచే శాసనసభ సమావేశాలు

Published: Wednesday January 30, 2019
 à°“టాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఐదో తేదీన ప్రభు త్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. శాసనసభ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయని, à°ˆ సభకు ఇవే చివరి సమావేశాలని చెప్పారు. మంగళవారమిక్కడి అసెంబ్లీ భవనంలోని తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మొదటిరోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నరు నరసింహన్‌ ప్రసంగిస్తారు. 31à°¨ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశమవుతుంది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. చర్చ తర్వాత సభ సంతాపం తెలుపుతుంది. తర్వాత వాయిదా పడుతుంది. సభకు 1, 2, 3, 4 తేదీల్లో సెలవులు. మళ్లీ 5 నుంచి 8 వరకు నాలుగు రోజు లు సభ జరుగుతుంది. 5à°¨ గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేశాక.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. తర్వాతి రోజు ల్లో ప్రభుత్వ బిల్లులు, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ నిర్వహిస్తాం. మార్చి 31 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. కానీ ఓటాన్‌ అకౌంట్‌ పేరుతో పూర్తి బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం’ అని పేర్కొన్నారు. కాగా.. తమ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు చిట్టచివరి సమావేశాలకూ హాజరు కావడంలేదు. పదే పదే కోరినా వాళ్లు రావడంలేదు..
 
అసెంబ్లీకి రావాలని పదేపదే కోరినా వైసీపీ రావడం లేదని స్పీకర్‌ అన్నారు. చివరి సమావేశాలకు రావాలని ప్రతిపక్ష నేత జగన్‌తో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేసినా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. ‘ప్రజలకు ఏది చెప్పాలన్నా అసెంబ్లీని మించిన వేదిక మరోటి లేదు. నేను ఏకగ్రీవంగా ఎన్నుకున్న స్పీకర్‌ను. à°Žà°‚à°¤ నమ్మకం ఉంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు? à°† బాధ్యతతోనే సభలో నడుచుకుంటున్నాను. నా విధుల్ని కచ్చితంగా నిర్వహిస్తున్నా ను. నిబంధనల ప్రకారమే స్పీకర్‌ నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. సభలో విపక్ష సభ్యు లు లేరన్న అసంతృప్తి స్పీకర్‌కూ ఉంటుంది. అసెంబ్లీకి రాకుండా టీఏ, డీఏలు తీసుకోవడం మంచిది కాదు. అది వారి నైతికతకు సంబంధించిన అంశం’ అని అన్నారు. వైసీపీ సభ్యులు ఏడాదిన్నర నుంచి సభకు రావడం లేదు కదా.. ఎందుకు నిర్ణయం తీసుకోలేదని విలేకరులు ప్రశ్నించగా.. ఒక్కోసారి లౌక్యంతో కూడా స్పీకర్‌ వ్యవహరించాల్సి ఉంటుందని బదులిచ్చారు. ఐదేళ్లలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు సంతృప్తిగా జరిగాయని ‘ఆంధ్రజ్యోతి’తో స్పీకర్‌ అన్నారు. కాగా.. గురువారం ఉదయం 9 గంటలకు రాజధానిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించే శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో అసెంబ్లీ à°—à°‚à°Ÿ ఆలస్యంగా మొదలవుతుంది.