చివరి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి ద్రోహం

Published: Sunday February 03, 2019
‘‘దేశాన్ని బీజేపీ సంక్షోభంలోకి నెట్టింది. à°ˆ ఐదేళ్ల పాలనలో మోదీ ఘోర వైఫల్యం చెందారు. కేంద్ర బడ్జెట్‌ పేదల పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. రోజుకు రూ.16 ఇస్తే రైతులకు ఒరిగేదేమీ ఉండదు. ఐదెకరాల భూమి ఉంటే రూ.500 భిక్ష వేస్తారా’? అని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. శనివారం తన నివాసం నుంచి టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్ల ఆదాయ పరిమితి రూ.8లక్షలు పెట్టారు. ఆదాయ పన్నుకు మాత్రం రూ.5 లక్షలే పెట్టారు. ఇటువంటి విరుద్ధ à°…à°‚ శాలు à°ˆ బడ్జెట్‌లో అనేకం ఉన్నాయి. బడ్జెట్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావనే లేదు.
 
భారత్‌లో నిరుద్యోగంపై చైనా కూడా హెచ్చరించింది’’ అని గుర్తు చేశా రు. అదే సమయంలో రాష్ట్రంలోనే 14 లక్షల మంది యువతకు కొత్తగా ఉపాధి కల్పించామని, ఒక్క ’à°•à°¿à°¯’లోనే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపా రు. ‘‘ఆటో మొబైల్‌, ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలు తె చ్చాం. ఎంఎ్‌సఎంఈ పార్కుల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాం’’ అని వివరించారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాన్నే అప్పు తెచ్చుకోమన్నా, తాను బకాయి ఉన్న నిధులను ఇంతవరకు కేంద్రం రాష్ట్రానికి చెల్లించలేదన్నారు. బడ్జెట్‌లో ఏపీ విషయమే లేదని, తన చివరిబడ్జెట్‌లోనూ బీజేపీ రాష్ట్ర ప్రజలకు ద్రోహమే చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘రాష్ట్రానికి జరిగిన à°ˆ అన్యాయాన్ని ఏ ఒక్కరూ విస్మరించరాదు. కేంద్రం చేసిన అన్యాయాన్ని నిగ్గదీసేందుకే నల్ల దుస్తులతో నిరసనలు తెలిపాం. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు నల్ల చొక్కాలతో ధర్నా చేశారు. జేఏసీ బంద్‌ విజయవంతమైంది. ఇలాంటి తీవ్ర నిరసనలు ఎన్నడూ జరగలేదు. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని పేర్కొన్న చంద్రబాబు, à°ˆ నిరసనల్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
 
‘‘పింఛన్లు అనగానే మనమే గుర్తుకురావాలి. పసుపు-కుంకుమ అనగానే టీడీపీ గుర్తు రావాలి. రూ.14 వేల కోట్లతో 54 లక్షల మందికి పింఛన్లు, రూ.10వేల కోట్లతో 94లక్షల మంది మహిళలకు పసుపు-కుంకుమ కానుక. 1.48 కోట్ల మందితో మమేకం అయ్యే పండగ ఇది. పింఛన్ల పండగలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. సరైన దృష్టి పెడితే ప్రతి గ్రామం టీడీపీకి కంచుకోటే అవుతుంది’’ అని నేతలకు సూచించారు.