ఆర్థిక బలహీన వర్గాలకు మరో 5 శాతం

Published: Thursday February 07, 2019

ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల ప్రవేశాల్లో.. కాపు, ఉప కులాలైన తెలగ, బలిజ, à°’à°‚à°Ÿà°°à°¿à°•à°¿ 5 శాతం, ఇతర ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మరో 5 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంతో à°—à°¤ నెల 21à°¨ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో కాపు, ఉప కులాలకు ఐదు శాతం, అగ్రకులాల్లో పేదలకు మరో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. à°ˆ మేరకు రూపొందించిన బిల్లును వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు శాసనసభ ముందుంచారు. విద్యా సంస్థల్లో సీట్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో à°ˆ రిజర్వేషన్లు వర్తించేలా బిల్లును ప్రభుత్వం రూపొందించింది. కాపు, ఉప కులాలకు à°’à°•à°Ÿà°¿, అగ్రకులాల్లో పేదల కోసం మరొకటి చొప్పున రెండు బిల్లులను మంత్రి ప్రవేశపెట్టారు. శాసనసభలో వివిధ అంశాలకు సంబంధించి ఐదు బిల్లులతోపాటు పలు పత్రాలను పలువురు మంత్రులు సభ ముందుంచారు.    చిత్తూరు జిల్లాలో వెల్‌టెక్‌ విశ్వవిద్యాలయం, అనంతపురంజిల్లాలో భారతీయఇంజినీరింగ్‌ సైన్సు, సాంకేతికవిజ్ఞాన వినూత్నకల్పన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును మానవ వనరులశాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి డిజిటల్‌ విద్యాబోధన కేంద్రం ఏర్పాటుకు మరో బిల్లును కూడా మంత్రి సభ ముందుంచారు.