ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో ‘నవోదయం’

Published: Sunday February 10, 2019
రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలను ఇప్పటికే నవోదయం పథకం à°•à°¿à°‚à°¦ సాటుసారా రహితంగా మార్చామని, నాలుగు నెలల్లో ప్రత్యేక ప్రణాళిక ద్వారా మిగిలిన జిల్లాల్లోనూ నాటుసారాను నిర్మూలించి రాష్ర్టాన్ని సారా రహితంగా ప్రకటిస్తామని ఎక్సైజ్‌ కమిషనర్‌ ముఖేశ్‌కుమార్‌ మీనా చెప్పారు. కమిషనర్‌à°—à°¾ బాధ్యతలు చేపట్టిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘మద్యం అమ్మకాలను పర్యవేక్షించడం ఒక్కటే కాదు. మద్యపాన వ్యసనానికి(ఆల్కహాలిజం) గురైన వారిని దాని నుంచి దూరం చేయడమూ మా బాధ్యతే’ అన్నారు.
 
ఆల్కహాలిజంను నిరుత్సాహపరిచేందుకు ‘జాగృతి’ పేరుతో త్వరలో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. జాగృతి కార్యక్రమంలో అవసరమైతే డీఅడిక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తొలుత ప్రజల్లో మద్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 208 ఎక్సైజ్‌ స్టేషన్లకు వేర్వేరుగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. స్టేషన్ల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. గంజాయిపైనా ప్రత్యేక దృష్టి పెట్టి, టెక్నాలజీ ఉపయోగించి, పోలీసులతో కలిసి నిర్మూలించే ప్రయత్నం చేస్తామని వివరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బెల్టు షాపులు, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌, నాటుసారాపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. బెల్టు షాపుల నియంత్రణకు à°•à° à°¿à°¨ చర్యలు చేపడతామన్నారు.
 
జనవరిలో 2500 కేసులు నమోదుచేసి, 2500 మందిని అరెస్టు చేసినట్టు వివరించారు. కేసులతోనే సరిపెట్టకుండా, ఒకసారి పట్టుబడిన వారు మళ్లీ బెల్టు నిర్వహించకుండా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు. తూర్పుగోదావరిలో నాటుసారా ఎక్కువగా ఉందని, కర్నూలు, చిత్తూరుల్లోనూ ప్రభావం ఉందన్నారు. గతంలో నాటుసారాను ప్రణాళిక ప్రకారం నిర్మూలించామని, అనంతరం బెల్టు షాపులపై దృష్టిపెట్టడం వల్ల కొంత పర్యవేక్షణ తగ్గిందని వివరించారు. ఇప్పుడు మళ్లీ నాటుసారా ఉత్పత్తి గ్రామాలను గుర్తించి ప్రణాళిక అమలు చేస్తామన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని అమలు చేస్తున్నామన్నారు.