అనంతపురంలో ఆలీ సందడి

Published: Tuesday February 12, 2019
నగరంలో హాస్యనటుడు ఆలీ సందడి చేశారు. సంగమే్‌షనగర్‌లో నూతనంగా నిర్మించిన గఫూర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ రతనాల సీమ అన్నారు. à°ˆ ప్రాంతానికి రావడం, ఇక్కడి ప్రజలను కలవడం ఆనందం కలిగిస్తోందన్నారు. సామాజిక స్పృహతో ప్రజలకు మంచి సేవలు అందించి పేరు ప్రతిష్టలు పొందాలని సూచించారు. కాగా, ఆలీని చూసేందుకు జనం ఆసక్తి చూపారు.
 
మధ్యాహ్నం 11 à°—à°‚à°Ÿà°² నుంచి ఆయన కోసం వేచిచూశారు. అయితే 12.50 గంటలకు ఆయన వచ్చారు. దీంతో వెంటనే ఆయనను చూసేందుకు జనం ఎగబడ్డారు. కేరింతలు కొడుతూ సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకుంటూ కనిపించారు. à°’à°• దశలో జనం మధ్య ఆలీ అతికష్టమ్మీద వెళ్లిపోవడం కనిపించింది. à°ˆ ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో గఫూర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అధినేత కేఎస్‌ అబ్దుల్‌ రజాక్‌ గఫూర్‌, వైద్యులు కేఎస్‌ అర్షద్‌ అయూబ్‌ గఫూర్‌, కేఎస్‌ మహ్మద్‌ ఆలీ ముషారత్‌ తదితరులు పాల్గొన్నారు.