దేశాన్ని ఏకం చేసే బాధ్యత రాష్ట్రపతిదే

Published: Wednesday February 13, 2019
‘మీకు ఎవరూ లేరు కాబట్టి మీకు భావోద్వేగాలు తెలియవు. కానీ ప్రజలకు భావోద్వేగాలు ఉంటాయని అర్థం చేసుకోండి’ అని ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని.. సరైన చదువు లేదని.. అభివృద్ధి ఎజెండా కూడా లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రవిభజన హామీలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి మంగళవారం వినతి పత్రం అందించిన తర్వాత ఆయన విజయ్‌ చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇది 5 కోట్ల మంది ఆంధ్రుల భావోద్వేగ అంశమన్నారు. ఇప్పటికీ హామీలను నెరవేర్చకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
 
ప్రజా కోర్టులో తేల్చుకుంటామని, ప్రజల తీర్పుతో వచ్చే ప్రభుత్వం ద్వారా హామీలను అమలు చేయించుకుంటామని స్పష్టం చేశారు. ‘పాలకులు ధర్మాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ప్రభుత్వాలు ధర్మాన్ని విస్మరిస్తే బాధ్యతాయుతమైన వారు పోరాడి ఎండగట్టాలి. అదే మేం చేశాం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రజలు సంతృప్తిగా లేరని, దానివల్లే తమ రాష్ట్రానికి హామీలిచ్చారని గుర్తు చేశారు. బిడ్డను బ్రతికించి తల్లిని చంపేశారని à°—à°¤ ఎన్నికల ముందు మోదీ అన్నారని, విభజన హామీలన్నీ నెరవేర్చుతామని హామీ ఇచ్చారని.. కానీ అమలు చేయలేదని గుర్తుచేశారు.
 
రాజధాని అమరావతికి శంకుస్థాపన సందర్భంగా యమునా జలాలు, పార్లమెంటు మట్టిని తమ ముఖాన కొట్టారని దుయ్యబట్టారు. విభజన సమయంలో ఎన్నో హామీలు ఇచ్చినా.. అన్యాయం చేసినందుకు 125 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్ర ప్రజలు ఓడించారని చెప్పారు. ఇప్పుడు బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని.. ఆంధ్ర ప్రజల భవిష్యత్‌తో, భావోద్వేగాలతో ఆడుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. à°ˆ విషయాలన్నిటినీ రాష్ట్రపతికి వివరించామని, రాజ్యాంగాధినేతగా రాష్ట్ర విభజన హామీలను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కోరామని వెల్లడించారు.
 
ధర్మాన్ని ప్రభుత్వం విస్మరించినప్పుడు, విభజించు పాలించు విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు దేశాన్ని ఏకం చేసే బాధ్యత రాష్ట్రపతిపై ఉంటుందని తెలిపారు. దేశాన్ని ఏకం చేసిన సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత మోదీకి లేదన్నారు. ‘ఆయన ప్రతి చోటా సమస్య సృష్టిస్తున్నారు. రాష్ట్రాల మధ్య, వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. రాజకీయ నేతలపై దాడులు చేస్తున్నారు. దేశానికి హానీ కలిగిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. విలేకరుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానాలివీ..