ప్రత్యేక హోదాపై యూటర్న్‌ ఎందుకు?

Published: Friday February 22, 2019
‘రాష్ట్రానికి న్యాయం చేయకపోగా, న్యాయం చేయాలని నిలదీస్తున్న సీఎం చంద్రబాబుపై బాధ్యత లేకుండా ఎదురుదాడి చేస్తారా? నేను చెప్పిందే వేదమంటూ వ్యవహరిస్తున్నారు. à°’à°• ఉన్నత ఆశయం... దేశాభివృద్ధికి, సమాజాభివృద్ధికి దోహదపడుతుంది. à°’à°• విద్వేషం... సమాజ విచ్ఛిన్నానికి, దేశ, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడానికి దారితీస్తుంది. విద్వేషం ఏ ఒక్క సమస్యను పరిష్కరించిన దాఖలాలు లేవని బీజేపీ అధిష్ఠానం గుర్తించాలి’ అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు. ‘విభజన చట్టంలో రూపొందించిన ప్రతి అంశాన్ని 100ు అమలు చేస్తామని అమరావతి రాజధాని ప్రారంభం సాక్షిగా హామీ ఇచ్చిన మోదీ చేసిందేమిటి? ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని రాజ్యసభలో పట్టుబట్టి అప్పటి ప్రధానిని ఒప్పించినవారు యూటర్న్‌ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది?.
 
రాష్ట్రానికి వివిధ పద్దుల à°•à°¿à°‚à°¦ రూ.14వేల కోట్లు మాత్రమే ఇచ్చామని పార్లమెంట్‌ సాక్షిగా సమాధానం ఇచ్చారు. అయితే గుంటూరు సభలో మోదీ రూ.3లక్షల కోట్లు, శ్రీకాకుళంలో అమిత్‌à°·à°¾ రూ.5 లక్షల కోట్లు, నితిన్‌ గడ్కరీ రూ.10లక్షల కోట్లు ఇచ్చామంటూ అబద్ధాలు చెప్పడమేంటి? మిగతా రాష్ట్రాల కంటే అదనంగా ఆంధ్రకి ఏమిచ్చారో ఎందుకు చెప్పడం లేదు? బీజేపీకి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ప్రధాని మోదీ మరో 60 రోజులు మాత్రమే పదవిలో ఉంటారు. తెలుగు ప్రజలతో పెట్టుకున్న వారెవరూ నిలవలేదు’ అని కళా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌à°·à°¾ అసత్య ఆరోపణలు చేశారని డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాకినాడలో విమర్శించారు.
 
‘విభజన హామీలు 18 అమలు జరపాల్సి ఉండగా, 14 అంశాలని అమిత్‌à°·à°¾ మాట్లాడుతున్నారు. పుల్వామా సంఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ అమిత్‌à°·à°¾ మాట్లాడారు. రాఫెల్‌ కుంభకోణం అంశం ప్రజలకు తెలిసిందే. బీజేపీ అవినీతిలో కూరుకుపోయింది’ అని రాజప్ప అన్నారు. గురువారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద మంత్రి కాల్వ, ఎంపీ సీఎం రమేశ్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘‘కేంద్రం విభజన హామీలను నెరవేర్చకపోయినా, ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం చంద్రబాబును బీజేపీ నేతలు విమర్శించినా తెలుగు వారి గుండె రగులుతుంది. చంద్రబాబుపై అమిత్‌à°·à°¾ అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదు. అమిత్‌à°·à°¾, మోదీ ఏ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తున్నారు.