ఉత్తమ ‘రెసిడెంట్‌’గా వైజాగ్‌

Published: Tuesday February 26, 2019
 à°¨à±€à°Ÿà°¿ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. à°ˆ విభాగంలో మన రాష్ట్రానికి జాతీయ జల అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కాకుండా ఆయా విభాగాల్లో రాష్ట్రానికి ఏడు అవార్డులు లభించాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన 82à°µ జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రానికి లభించిన మూడో ఉత్తమ రాష్ట్ర అవార్డును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి చేతుల మీదుగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అందుకున్నారు. నదుల ప్రక్షాళన విభాగంలో దేశవ్యాప్తంగా ఉత్తమ జిల్లాగా à°•à°¡à°ª నిలిచింది. à°ˆ అవార్డును à°† జిల్లా కలెక్టర్‌ సీ హరికిరణ్‌ అందుకున్నారు. ఇదే విభాగంలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్నూలుకు లభించిన అవార్డును à°† జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అందుకున్నారు. భూగర్భ జలాల రిచార్జ్‌ విభాగంలో అనంతపూర్‌కు వచ్చిన అవార్డును à°† జిల్లా కలెక్టర్‌ జీ వీరపాండ్యన్‌, విశాఖకు లభించిన అవార్డును à°† జిల్లా భూగర్భ జలాల డిప్యుటీ డైరెక్టర్‌ కేఎస్‌ శాస్ర్తి స్వీకరించారు. ఇదే విభాగంలో ఉత్తమ రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌à°—à°¾ విశాఖకు చెందిన జేఆర్‌ నగర్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ను అవార్డు వరించింది. ఉత్తమ రిలీజియస్‌, రిక్రియేషనల్‌ వాటర్‌ టూరిజం విభాగంలో సింహాచలం వరాహ లక్ష్మీనరసింహా స్వామి దేవస్థానానికి వచ్చిన అవార్డును దేవస్థానం ఈవో కే రామచంద్ర మోహన్‌ స్వీకరించారు.
 
జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ఉత్తమ అవార్డులు లభించడం సంతోషంగా ఉందని మంత్రి దేవినేని ఉమా అన్నారు. 11 విభాగాలకు నామినేషన్లు పంపగా ఏడు విభాగాల్లో అవార్డులు లభించాయని వివరించారు. సీఎం చంద్రబాబు కార్యదీక్ష ఫలితంగానే ఈ అవార్డులు లభించాయని తెలిపారు. భూగర్భ జలాల్లో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖకు గత ఐదేళ్లలో ఆయా సంస్థలు మొత్తం 33 అవార్డులు ఇచ్చాయని గుర్తు చేశారు. కేంద్రం ఏ అవార్డు ఇచ్చినా మొదటి మూడు స్థానాల్లో ఉంటున్నామని వివరించారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.