రాడార్‌ బలహీనతే భారత్‌ ఆయుధం?

Published: Wednesday February 27, 2019
రాడార్‌ బలహీనతే భారత్‌ ఆయుధం?.. ఊహించని దారిలో వెళ్లి వైమానిక దాడి?
పుల్వామా దాడికి ప్రతీకారం తప్పదని భారత్‌ నేరుగా పాక్‌ను హెచ్చరించింది. దాడి చేస్తే తిప్పికొడతామని పాకిస్థాన్‌ సైతం చెబుతోంది. అంటే ఇది అనూహ్యంగా జరిగిన దాడి కాదు. దాడి జరుగుతుందని పాక్‌ ముందే ఊహించింది. అప్రమత్తంగానే ఉంది. అయినా కూడా భారత యుద్ధ విమానాలు భారత రాడార్ల కళ్లుగప్పి పాక్‌ గగనతలంలోకి ఎలా ప్రవేశించాయి? పాక్‌ రాడార్లు ఎందుకు విఫలమయ్యాయి? à°Žà°‚à°¤ గొప్ప రాడార్‌ అయినా కొన్ని బలహీనతలు ఉంటాయి. సరిహద్దు మొత్తంపైనా రాడార్లతో నిఘా పెట్టడం అసాధ్యం. భారత యుద్ధ విమాన స్థావరాలు ఎక్కడ ఉన్నాయి? అవి ఎటువైపు నుంచి వస్తాయి? అని ఊహించి అక్కడ మాత్రమే రాడార్లను మోహరిస్తుంటారు. కానీ శత్రువు ఊహించని దారిలో వెళ్లడం ద్వారా రాడార్ల కళ్లుగప్పవచ్చు. పైగా ఎక్కువ ఎత్తులో ఎగిరే విమానాలనే రాడార్లు సులభంగా కనిపెట్టగలుగుతాయి. ఎందుకంటే భూ ఉపరితలం నుంచి కొన్ని వందల మీటర్ల ఎత్తువరకూ క్లట్టర్‌ ఎక్కువగా ఉంటుంది. (క్లట్టర్‌ అంటే భూ ఉపరితలం నుంచి, భవనాల నుంచి, సముద్రం నుంచి, వర్షపు చినుకుల నుంచి వెలువడి రాడార్‌ను అయోమయపరిచే అవాంఛిత సిగ్నల్స్‌). తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను à°ˆ క్లట్టర్‌ నుంచి వేరుచేసి గుర్తించడం కష్టం. భారత యుద్ధవిమానాలు అనూహ్యమైన మార్గంలోగానీ, తక్కువ ఎత్తులోగానీ ఎగురుతూ పాక్‌ను బురిడీ కొట్టించి ఉండవచ్చు. భారత యుద్ధవిమానాల్లో ఉన్న అత్యాధునిక జామర్లు పాతకాలపు పాక్‌ రాడార్లను జామ్‌ చేసి ఉండవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. నిధుల లేమితో అల్లాడుతున్న పాక్‌ పాతకాలపు ఆయుధాలతోనే నెట్టుకొస్తోంది.