ఇవి ధన ప్రవాహ ఎన్నికలు.. భారీ ఖర్చు రాష్ట్రంగా ఆంధ్ర

Published: Sunday March 03, 2019
 à°µà°šà±à°šà±‡ ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను గుర్తించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఎన్నికల నిర్వహణలో అత్యంత అప్రమత్తతతో పారదర్శకంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఆయన ఆధ్వర్యంలో సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మీడియా సర్టిఫికేషన్‌ మోనటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ) సభ్యులు, మీడియా ప్రతినిధులతో వర్క్‌షాప్‌ శనివారం జరిగింది. ఎమ్మెల్సీ, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఎంసీఎంసీలు ఎంతో కీలకమని à°ˆ సందర్భంగా ద్వివేది అన్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోకెల్లా అత్యంత సున్నితమైంది ఆంధ్రప్రదేశ్‌యేనని, మీడియా సర్టిఫికేషన్‌, మోనటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
 
‘‘మద్యం, నగదు వంటి తాయిలాల పంపిణీతో అత్యధిక ఎన్నికల ఖర్చయ్యే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఏపీలో ఎన్నికల నిర్వహణతీరు తెన్నుల పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధిక సంఖ్యలో ఎన్నికల పరిశీలకులు రానున్నారు. కాబట్టి, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేలా కృషి చేయాలి. ఎన్నికల సంఘానికి ఏ పార్టీ అభ్యర్థి అయినా ఒక్కటే. అందరూ మనకు సమానమే’’ అని స్పష్టం చేశారు.
 
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఎంసీఎంసీ కంట్రోల్‌ రూమ్‌లు నిరంతర పర్యవేక్షణ చేస్తూ, పత్రికలు, టీవీల్లో వచ్చే పెయిడ్‌ ఆర్టికల్స్‌తో పాటు సోషల్‌ మీడియాపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ద్వివేది కోరారు. ఓటర్లను అభ్యర్థులు ప్రలోభపెట్టాలని వేసే ఎత్తుగడలను పసిగట్టి, చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పెయిడ్‌ ఆర్టికల్స్‌ పెద్ద సమస్య అని అన్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ఉన్న ఎంసీఎంసీల్లో ఐదుగురు సభ్యులున్నారని, వారితో వివిధ రకాల మీడియాల్లో వచ్చే వార్తలను పర్యవేక్షించడం కష్టమన్నారు. కనీసం 20 మంది వరకూ ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌, సోషల్‌మీడియాపై అవగాహన ఉన్న వారు ఇందులో సభ్యులుగా ఉండాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌లు 24 గంటలూ పని చేయాలన్నారు.