ఆ ముగ్గురి మెగా కుట్ర.. సీబీఐకి ఈడీ లేఖే ఆధారం

Published: Thursday March 14, 2019
బీజేపీ, వైసీపీల మెగా కుట్ర బట్టబయలైందని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘జగన్‌ అవినీతి రూ.46,500 కోట్లు కాదు.. మరింత ఉంది. à°ˆ కేసులో మరింత లోతుగా విచారణ జరపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ లేఖ రాసినా ఎందుకు స్పందించలేదో ప్రధాని మోదీ చెప్పాలి. రెండేళ్ల క్రితం రాసిన లేఖపై ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదో బదులివ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు. జగన్‌ కేసుల విషయంలో సీబీఐకి ఈడీ రాసిన లేఖ బయటపడిన నేపథ్యంలో చంద్రబాబు బుధవారం మీడియాతో మాట్లాడారు.
 
దేశానికి కాపలాదారును అని చెప్పుకొంటున్న ప్రధాని మోదీ... జగన్‌లాంటి అవినీతిపరులకు కాపలా కాస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ‘జగన్‌ అవినీతి విషయంలో సీబీఐ 74మంది వ్యక్తులు, సంస్థలపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. అందులో 28మందిపైనే చార్జిషీట్‌ వేసింది. దీనిపై ఈడీ డైరెక్టర్‌ 2017లో సీబీఐకి à°’à°• లేఖ రాశారు. చార్జిషీటు వేయకుండా.. క్విడ్‌ప్రోకో జరగలేదని కొన్ని కంపెనీలను వదిలేశారు. ఇది సరికాదు. ఉదాహరణకు హిందూజా గ్రూప్‌కు చెందిన 11.10ఎకరాల భూమిని జగన్‌ బినామీ కంపెనీకి ఇచ్చారు. దాని విలువ రూ.177.60కోట్లు. ఇప్పుడు దాని విలువ రూ.500కోట్లు. అదేవిధంగా మ్యాక్‌ సొల్యూషన్స్‌ సంస్థకు రూ.104కోట్ల లబ్ధి చేసింది. సంస్థ రిజిస్ర్టేషన్‌ కూడా కాకుండానే నానక్‌రామ్‌గూడలో ఆరెకరాల కేటాయించారు. à°† భూమిని చూ పించి జగన్‌ రూ.104కోట్లు సంపాదించారు.
 
à°ˆ నేపథ్యంలో మొ త్తం కేసును సమగ్రంగా విచారణ జరపాలని ఈడీ కోరింది. అయినా మోదీ పట్టించుకోలేదు’ అని చంద్రబాబు తెలిపారు. విచారణ చేస్తే జైలుకెళ్లాల్సి వస్తుందనే భయంతోనే జగన్‌ మోదీకి దాసోహం అన్నారు. విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి కార్యాలయంలోనే కూర్చుంటారని... ఫొటోలు కూడా దొరికాయని తెలిపారు. ‘తిరుపతి సభలో స్వర్ణాంధ్ర కావాలా? స్కామాంధ్ర కావాలా అని మోదీ అడిగారు. ఈరోజు స్కాములు చేసేవారిని పీఎంవోలో పెట్టుకున్నారు’ అని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై 20ఏళ్ల కిందటి కేసులను కూడా మోదీ తిరగతోడుతున్నారని.. జగన్‌ను కేసు విచారణ చేయాలని సాక్షాత్తూ ఈడీ లేఖ రాసినా ఎందుకు తొక్కిపెట్టారని నిలదీశారు.