వైసీపీ అధినేత జగన్‌ సొంత జిల్లాలోనే వ్యతిరేకత

Published: Friday March 15, 2019
 à°µà±ˆà°¸à±€à°ªà±€ అధినేత జగన్‌ సొంత జిల్లాలోనే, à°† పార్టీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. à°•à°¡à°ª జిల్లా జమ్మలమడుగు పరిధిలో గురువారం ప్రచారానికి బయలుదేరిన మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైసీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డిలను ప్రతి గ్రామంలో మహిళలు అడ్డుకొన్నారు. ‘మా ఇంట్లోకే కాదు.. మా ఊర్లోకి కూడా రావద్దు’ అంటూ ఎక్కడికక్కడ వారిని నిలువరించారు. ‘‘ప్రశాంతంగా బతికే ఊర్లో చిచ్చుపెడతారా? ఐదేళ్లలో ఏనాడైనా మీ ముఖం చూశామా? అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు?’’ అంటూ నిలదీశారు. ప్రచారంలో భాగంగా అవినాశ్‌రెడ్డి బృందం జమ్మలమడుగు నియోజకవర్గంలోని మంత్రి ఆదినారాయణరెడ్డి పట్టున్న పి.సుగుమంచిపల్లె, ధర్మాపురం, గొరిగెనూరు, పెద్దగండ్లూరు గ్రామాల్లో తిరిగారు. మొదట పి.సుగుమంచిపల్లెకు వెళ్లిన వైసీపీ నేతలను.. à°“ మహిళ గట్టిగా నిలేసింది.
 
 
‘‘మా గ్రామానికి ఎందుకు వస్తున్నారు? టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణ మా గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. లింకు రోడ్లు వేయడమే కాదు.. రుణాలిప్పించి మా బతుకులు బాగుపరుస్తున్నారు. మా గ్రామంలో ఏ సమస్యలూ లేవు’’ అని ఆమె తేల్చి చెప్పింది. ఎంపీగా గెలిచాక, తిరిగి చూశావా అంటూ అవినాశ్‌పై మండిపడింది. ఇప్పుడు తిరిగి తమ à°Šà°°à°¿à°•à°¿ వచ్చి గొడవలు పెడతారా అంటూ వాదించింది. ‘ఉండమ్మా. రోడ్డుపైనే ఉన్నాం. మీ à°Šà°°à°¿à°•à°¿ రాలేదు. మీ ఇంటిలోకి రాలేదు’ అంటూ అవినాశ్‌రెడ్డి ఏదో చెప్పబోగా, మిగిలిన గ్రామస్థులు ఆమెతో గొంతు కలపడంతో నేతలు వెనుదిరిగారు. అక్కడినుంచి ధర్మాపురానికి వెళ్లగా అక్కడా నిరసనలు ఎదురయ్యాయి. మాజీ సర్పంచ్‌ పుల్లారెడ్డి తన అనుచరులతో వారిని అడ్డుకొన్నారు. అక్కడనుంచి వెనుదిరిగిన నేతలు, గొరిగెనూరు వెళ్లడానికి ప్రయత్నించగా, ఈసారి పోలీసులు వారిని అడ్డుకొన్నారు. భారీ సంఖ్యలో వైసీపీ నేతలుండడంతో, ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నదని భావించిన పోలీసులు, à°† గ్రామంలోకి వెళ్లడానికి వారిని అనుమతించలేదు. దీనిపై సుధీర్‌రెడ్డి పోలీసులతో గొడవకు దిగారు.